ఆరోసారి ముఖ్యమంత్రి పీఠంపై అవకాశవాద నితీష్
జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నేత నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆరవ సారి పదవీ స్వీకార ప్రమాణం చేశాడు. రాజకీయ నీతికి అసలు సిసలు చిరునామాగా చెప్పుకునే ఈ పెద్ద మనిషి తాను “ఛీ, ఫో” అని తిట్టిపోసిన మోడి నేతృత్వ బిజేపితోనే మళ్ళీ జట్టు కట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాడు. పక్కా పదవీ వ్యామోహాన్ని బాధ్యత నిర్వహణగా చెప్పుకుంటూ, పచ్చి రాజకీయ అవినీతికి నీతి రంగు పులుముతూ రాజకీయ భ్రష్టత్వంలో తాను ఎంత మాత్రం…