ఢిల్లీ ఆటో ఎక్స్ పో -కార్టూన్

ప్రస్తుతం జరుగుతున్న వివిధ అధికారిక, అనధికారిక కార్యక్రమాలను రాజకీయ పార్టీల కార్యకలాపాలతో, పార్టీల నాయకుల ధోరణులతోనూ, వారి ప్రకటనల తోనూ పోల్చి సున్నితమైన రాజకీయ వ్యంగ్యం పండించడం కార్టూనిస్టులకు ఇష్టమైన ప్రక్రియ.  ఈ ప్రక్రియ ద్వారా ఆయా నాయకుల, పార్టీల వ్యవహార శైలి గురించి తేలికగా అర్ధం చేసుకునే అవకాశం పాఠకులకు, లభిస్తుంది. ఒక్క చూపులో బోలెడు అర్ధాన్ని ఈ కార్టూన్ ల ద్వారా గ్రహించవచ్చు. ఢిల్లీలో నొయిడాలో ఆటో ఎక్స్ పో – 2016 ప్రదర్శన…

పొన్ను కర్రా, మోడి షా కోటను కూల్చునది? -కార్టూన్

బీహార్ ఎన్నికల ఫలితాలు బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ తదితర హిందూత్వ సంస్ధలకు గట్టి షాకే ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఓటమి ఎరగని జగజ్జేతగా హిందూత్వ గణాల చేత అదే పనిగా పొగడ్తలు అందుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడి మొఖంపై నెత్తురు చుక్క లేకుండా చేశాయి. పాచిక విసిరితే తిరుగే ఉండని గొప్ప వ్యూహకర్తగా మన్ననలు అందుకుంటున్న అమిత్ షా అవాక్కై నెత్తి గోక్కునేలా చేశాయి. పుండు మీద కారం అన్నట్లుగా ఇప్పుడు నితీశ్ కుమార్ జాతీయ స్ధాయిలో మోడిని…

మతమౌఢ్యం ప్రజలకు ఇష్టం లేదు, మోడిని ఉద్దేశిస్తూ జె.డి(యు)

ప్రధానమంత్రి పదవి కోసం ఎన్.డి.ఏ లో పోటీ తీవ్రం అయినట్లు కనిపిస్తోంది. మౌతమౌఢ్యం ఉన్నవారిని ప్రధానిగా దేశ ప్రజలు అంగీకరించరని ఎన్.డి.ఏ భాగస్వామి జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు శివానంద్ తివారీ బుధవారం వ్యాఖ్యానించి మోడి పట్ల తమ పార్టీ కి ఉన్న వ్యతిరేకతను మరోసారి వ్యక్తం చేశాడు. 2014 లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో లేక ప్రతిపక్షంలోనే కూర్చోవాలో బి.జె.పి నిర్ణయించుకోవాలని ఆయన హెచ్చరించాడు. నరేంద్ర మోడి ని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘మతమౌఢ్యంతో నిండిన…

ముందు నీ రాష్ట్రం సంగతి చూసుకో, మోడీ తో నితీష్

బీహార్ అభివృద్ధిపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరస్కరించాడు. బీహార్ గురించి వ్యాఖ్యానించే ముందు గుజరాత్ సంగతి చూసుకోవాలని హెచ్చరించాడు. నేరుగా మోడీని సంబోధించకుండానే సొంత రాష్ట్ర వ్యవహారం సరిచేసుకోకుండా ఇతర రాష్ట్రాల్లో వేలు పెట్టొద్దని హెచ్చరించినంత పని చేశాడు. బీహార్ లో కుళ్ళిపోయిన కుల రాజకీయాల వల్ల ఆ రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడిపోయిందని ఆదివారం రాజ్ కోట్ లో బి.జె.పి సమావేశంలో ప్రసంగిస్తూ నరేంద్ర మోడి వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు…