అవాంఛనీయ ఉపసంహరణ -ది హిందు ఎడిటోరియల్

(లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రధాన నినాదాలు అభివృద్ధి, ఉపాధి. అధికారంలోకి వచ్చాక ఈ నినాదాలకు కట్టుబడి ఉండడానికి బదులు సరిగ్గా వ్యతిరేక చర్యలను బి.జె.పి ప్రభుత్వం తలపెడుతోంది. మిలియన్ల మంది గ్రామీణ పేదలకు కాస్తో, కూస్తో వరంగా పరిణమించిన గ్రామీణ ఉపాధి పధకంలో కోత విధించడం ద్వారా మోడి ప్రభుత్వం తన హామీని అడ్డంగా ఉల్లంఘిస్తోంది. ఈ అంశంపై ఈ రోజు హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం ఇది. -విశేఖర్) ప్రపంచంలో అతి…

రాముడు చెడ్డ బాలుడు -రాం జేఠ్మలాని

‘రాముడు మంచి బాలుడు’ అని చదవడమే ఇప్పటిదాకా మనకున్న అలవాటు. ఇకనుండి ‘రాముడు చెడ్డవాడు’ అనికూడా చదువుకోవచ్చు. బి.జె.పి రాజ్యసభ సభ్యుడు, జగన్ బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలం అయిన ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ రాం జేఠ్మలాని భారత ప్రజలకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఏ కారణంతో అయితే ఇన్నాళ్లూ ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారో సరిగ్గా అదే కారణంతో రాముడు తాజాగా చెడ్డవాడు కావడమే ఓ ఆసక్తికర పరిణామం. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలపై…

నితిన్ గడ్కారీ భవితవ్యం ఎటు వైపు? -కార్టూన్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండోసారి కూడా బి.జె.పి అధ్యక్షుడుగా ఎన్నిక కావాలని కోరుకుంటున్న గడ్కారీ ఆశలకు సాక్ష్యాత్తూ ఎల్.కె.అద్వానీ నుండే ప్రతిఘటన ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం ముంబైలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడి సహాయంతో రెండో పదవీకాలానికి అనుమతిని గడ్కారీ సంపాదించినప్పటికీ ఆ నిర్ణయం జాతీయ మహాసభలో ఆమోదం పొందవలసి ఉంది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అద్వానీ ముంబైలోనే అలకపాన్పు ఎక్కాడు.…