సౌదీ కార్మిక చట్టంతో 18 వేల భారతీయులు ఇంటికి

సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశీయుల నిరుద్యోగం తగ్గించడానికి నూతన కార్మిక చట్టం ‘నితాకాత్’ ప్రవేశ పెట్టడంతో వేలాది మంది భారతీయులు ఇండియాకు తిరుగుముఖం పడుతున్నారు. కొత్త చట్టం వలన తమ ఉద్యోగాలు ఎలాగూ పోతాయన్న ఆలోచనతో ఉన్న అనేకమంది ‘ఎమర్జెన్సీ సర్టిఫికేట్’ కోసం భారత రాయబార కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగంలో చేరేటప్పుడు పాస్ పోర్టులను ఎంప్లాయర్స్ తీసేసుకుంటారు. దానితో ‘ఎమర్జెన్సీ సర్టిఫికేట్’ అవసరం ఏర్పడింది. సౌదీ అరేబియాలో 20 లక్షల  మందికి పైగా భారతీయులు…