మెక్సికో మాఫియా: ‘మిస్సింగ్ 43’ కోసం ఆందోళనలు -ఫోటోలు

మెక్సికో డ్రగ్స్ మాఫియా ముఠాల అరాచకాలకు పెట్టింది పేరు. మెక్సికో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలు నడిపే స్ధాయిలో అక్కడి డ్రగ్స్ మాఫియాలు విలసిల్లుతున్నాయి. పోలీసు విభాగాలు కూడా బహిరంగంగానే మాఫియా ముఠాలకు దన్నుగా నిలుస్తాయి.  మాఫియా ముఠాల పెత్తనానికి సవాలుగా పరిణమించారో, మరే కారణమో తెలియదు గానీ గత సెప్టెంబర్ 26 తేదీన ఇగువాల అనే పట్టణంలో పోలీసులు, ముసుగులు ధరించిన మాఫియా బలగాలు మూకుమ్మడిగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులు ఉపాధ్యాయులపై తుపాకులతో…