పెల్లెట్ గన్ మన వాళ్ళకే తగిలితే?! -ఫోటోలు

కాశ్మీర్ లో సి‌ఆర్‌పి‌ఎఫ్ పోలీసులు స్ధానిక ప్రజలపై విచ్చలవిడిగా వినియోగిస్తున్న సో-కాల్డ్ ప్రమాద రహిత (నాన్-లెధల్) పెల్లెట్ తుపాకులు మనకు బాగా తెలిసిన వాళ్ళకు తగిలితే, ఆ దెబ్బల్ని మన టి.వి చానెళ్లు పచ్చిగా చూపిస్తే మనం ఎలా స్పందిస్తాము? చాలా మంది భారతీయులకి కాశ్మీర్ ప్రజలు అంటే ముస్లింలు మాత్రమే. వారు మనుషులనీ, వారికీ భారత దేశ ప్రజలకు మల్లేనే ఆశలు, ఆకాంక్షలు, ముఖ్యంగా ప్రాణాలు, జీవితాలు ఉంటాయని భావించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. కాశ్మీర్…