అణ్వాయుధాలను అప్రమత్తం చేసిన పుతిన్!

రష్యా అధ్యక్షుడు అసాధారణ చర్యకు పూనుకున్నాడు. అమెరికా, నాటో నేతల ప్రకటనలకు స్పందనగా దేశంలోని అణ్వాయుధాలను ‘హై అలర్ట్’ లో ఉంచాలని రష్యన్ మిలట్రీని, రక్షణ శాఖను ఆదేశించాడు. పుతిన్ ఆదేశాలను ‘బాధ్యతారాహిత్యం’ గా నాటో కూటమి అభివర్ణించింది. నాటో కూటమికి చెందిన ఉన్నతాధికారులు “దూకుడు ప్రకటనలు” (Aggressive Statements) జారీ చేస్తున్నారని పుతిన్ ఆరోపించాడు. తమ దేశం రష్యా గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యానిస్తున్నారని తప్పు పట్టాడు. “నాటో కూటమికి నేతృత్వం వహిస్తున్న దేశాలు మా దేశం…

అణు యుద్ధానికి పాల్పడం! -P5 దేశాలు

P5 అంటే ‘పర్మినెంట్ 5’ అని అర్ధం. ఐరాస భద్రతా సమితి (Security Council) లో 5 శాశ్వత సభ్య దేశాలను షార్ట్ కట్ లో P5 అని సంభోధిస్తారు. రష్యా, బ్రిటన్, చైనా, అమెరికా, ఫ్రాన్స్… ఈ 5 దేశాలు భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు. ఈ దేశాలకు భద్రతా సమితిలో ఏ నిర్ణయాన్నైనా వీటో చేసే హక్కు ఉంటుంది. అనగా ఏ నిర్ణయమైనా ఈ 5 దేశాలు ఆమోదిస్తేనే జరుగుతుంది.…

ఆకస్: సుదృఢం అవుతున్న బహుళ ధృవ ప్రపంచం! -3

    నాటోకు కాల దోషం? అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైనిక ఉపసంహరణ విషయమై నాటో కూటమి లోని ఈ‌యూ సభ్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాటో కూటమితో సంప్రదించకుండా, ఈ‌యూతో ఏకీభావం సాధించకుండా ఆఫ్ఘన్ నుండి సైనిక బలగాలను ఆగస్టు 31 లోపు ఉపసంహరిస్తున్నామని బైడెన్ ఏకపక్షంగా ప్రకటించడం ఈ‌యూ దేశాలకు గాని నాటో కూటమికి గానీ మింగుడు పడలేదు. అత్యంత పెద్దదయిన నాటో ‘ఉమ్మడి’ మిలట్రీ స్ధావరం అయిన బాగ్రం వైమానికి స్ధావరాన్ని జులైలో ఖాళీ…

నాటోతో తలపడుతున్న టర్కీ ప్రధాని?

  టర్కీలో జులై 15 నాటి మిలట్రీ కుట్రలో పాత్ర పోషించిన వారి పైన లేదా పాత్ర పోషించారని అనుమానించబడుతున్న వారి పైన విరుచుకుపడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కుట్రలో పాల్గొన్నారన్న అనుమానంతో 1700 మంది వరకు పోలీసులను కొద్దీ రోజుల క్రితం సస్పెండ్ చేయడమో లేదా డిస్మిస్ చేయడమో చేసిన టర్కీ ప్రధాని రెసిపీ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా నాటో దేశాలలోని రాయబారులను కూడా టార్గెట్ చేసుకున్నాడు. నాటో సభ్య దేశాలలో మిలట్రీ కూటమి రాయబారులుగా…

ఉక్రెయిన్: త్వరలో జెనీవా సమావేశం, పరిష్కారం అనుమానం

ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఇరు పక్షాలు చర్చలకు మాత్రం తలుపులు తెరిచే ఉంచారు. ఉక్రెయిన్ లో తమ తమ ప్రయోజనాలను ఘర్షణలు లేకుండా సంరక్షించుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇ.యు, ఉక్రెయిన్, రష్యాలు సమావేశం అవుతున్నాయి. ఇందులో ఉక్రెయిన్ పాత్ర నామమాత్రం. ఉక్రెయిన్ పాలనను ప్రస్తుతం అదుపులో ఉంచుకున్నది ఇ.యు, అమెరికాలే కనుక ఆ మేరకు పశ్చిమ సామ్రాజ్యవాదులకు సానుకూలత ఏర్పడి ఉంది. అయితే ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో రష్యా భాష మాట్లాడే…

ఆఫ్ఘన్ దురాక్రమణ: 3 రోజుల్లో 8 మంది నాటో సైనికులు హతం

శుక్రవారం నుండి ఆదివారం వరకూ మూడు రోజుల పరిధిలో ఎనిమిది మంది నాటో సైనికులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రతిఘటనా దళాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సైనిక స్ధావరాలపై దాడులు చేసి శుక్రవారం ఇద్దరు, శనివారం మరో ఇద్దరు, ఆదివారం నలుగురు విదేశీ దురాక్రమణ సైనికులను చంపేశారు. చనిపోయిన విదేశీ సైనికులు ఏ దేశానికి చెందినదీ తెలియలేదు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లోని బ్రిటిష్ స్ధావరంలో శుక్రవారం చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికులని, శనివారం చనిపోయిన ఇద్దరు…

కొత్త ఆయుధంతో అమెరికాకు దడ పుట్టిస్తున్న తాలిబాన్

ఇటీవలి కాలంలో తాలిబాన్ బలగాలు నాటోకి చెందిన హెలికాప్టర్లను కూల్చివేస్తున్న వార్తలు వరుసగా వెలువడ్డాయి. దానికి కారణం తాలిబాన్ కొత్త ఆయుధాన్ని సమకూర్చుకోవడమేనని తాలిబాన్ వర్గాలను ఉటంకిస్తూ ఏసియా టైమ్స్ పత్రిక తెలిపింది. భూమి మీది నుండి గాలిలోకి ప్రయోగించే మిసైల్ ద్వారా తాము గణనీయమైన సంఖ్యలో హెలికాప్టర్లను కూల్చివేశామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు. అయితే నాటో, అమెరికా వర్గాలు మాత్రం తమ హెలికాప్టర్లు కూలినప్పుడల్లా సాంకేతిక లోపం వలన కూలిందని చెబుతున్నాయి. తాలిబాన్ ఇంతవరకూ ఒకటీ…

బాంబుదాడిలో ఆఫ్ఘన్ ఆల్-ఖైదా నెం.2 మరణం -నాటో దురాక్రమణ సేనలు

అమెరికా నాయకత్వంలోని దురాక్రమణ సేనలు ఆఫ్ఘనిస్ధాన్ ఆల్-ఖైదా నెం.2 నాయకుడిని బాంబు దాడిలో చంపేశామని ప్రకటించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లోని కూనార్ రాష్ట్రంలో రెండు వారాల క్రితం జరిపిన బాంబు దాడిలో ఆఫ్ఘనిస్ధాన్‌కి చెందిన ఆల్-ఖైదా సంస్ధకు నెం.2 నాయకుడిగా పేర్కొనదగ్గ “అబ్దుల్ ఘనీ” చనిపోయాడని అమెరికా నాయకత్వంలోని నాటో సేనలు తెలిపాయి. ఇతనిని అబు హాఫ్స్ ఆల్-నజ్ది అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. సౌదీ అరేబియా దేశానికి చెందిన ఘనీ అనేక మంది అమెరికా సైనిక అధికారుల…

లిబియా తిరుగుబాటు ప్రతినిధితో హిల్లరీ సమావేశం, నో-ఫ్లై జోన్ ఆమోదం?

నాటో కూటమి లిబియా గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ లో జి-8 గ్రూపు దేశాల మంత్రుల సమావేశం జరిగింది. లిబియా భూభాగంపై ఉన్న గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే విషయాన్ని చర్చించడం కోసం జి-8 దేశాల మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వ ప్రతినిధి “మహమ్మద్ జెబ్రిల్” హిల్లరీ క్లింటన్ ను కలిశాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశం వివరాలు ఏవీ తెలియలేదు. జి-8…

గడ్డాఫీ స్వాధీనంలో రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’

గడ్డాఫీ బలగాలు రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం మొదటి ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ను వశం చేసుకున్న గడ్డాఫీ బలగాలు సాయంత్రానికి ‘బ్రెగా’ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటు బలగాలు తమ కేంద్ర పట్టణమయిన ‘బెంఘాజీ’ కి ముఖద్వారమైన ‘అజ్దాబియా’ పట్టణానికి తిరుగుటపా కట్టారు. అజ్దాబియా కూడా గడ్డాఫీ స్వాధీనం చేసుకున్నట్లయితే తిరుగుబాటుదారుల వశంలో ఉన్న తూర్పు ప్రాంతంపై కూడా గడ్డాఫీ బలగాలు దాడి చేయవచ్చు. సాయుధ గ్యాంగులను…