ఉగ్రవాదానికి పాక్ విరుగుడు మరణ శిక్షలు! -కార్టూన్

పాక్ ప్రధాని: “నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను- మరణ దండనపై నిషేధాన్ని ఎత్తివేశామని…” ********* పెషావర్ ఉగ్ర దాడిలో 130 మందికి పైగా స్కూల్ పిల్లలు మరణించిన దరిమిలా ఉగ్రవాదంపై కత్తి కడుతున్నట్లు చూపడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తోంది. అందులో మొదటిది మరణ శిక్షలు! ఉగ్రవాదులకు మరణ దండన విధిస్తామనడం ఒక విధంగా హాస్యాస్పదం. ఉగ్రవాదులే చావడానికి నిర్ణయించుకుని వచ్చి దాడులు చేస్తుంటే వారికి మరణ దండన వేస్తామంటే జడిసిపోతారా? ఉదాహరణకి పెషావర్ దాడినే తీసుకుంటే దాడి…

ఇండియాతో చర్చలు: మండుతున్న పాకిస్ధాన్ -కార్టూన్

“… జనాబ్ మోడీజీ, మీతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మేము గీత దాటితిమి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో…” *** ప్రస్తుతం పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్, ముఖ్యంగా పార్లమెంటు ప్రాంతం ఆందోళనలతో రగులుతోంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ, మరో మతగురువు నేతృత్వంలోని సంస్ధ రెండూ పాకిస్ధాన్ పార్లమెంటు మీదికి దండెత్తి వచ్చారు. తమ ఆందోళనకు వారు చెబుతున్న కారణం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని. అక్రమ ప్రభుత్వం కనుక వెంటనే రాజీనామా చేసి…

పాకిస్తాన్ పై తప్పుడు సలహాలు -ది హిందు సంపాదకీయం

(Ill-advised on Pakistan శీర్షికతో ది హిందూ ఈ రోజు సంపాదకీయం రాసింది. దానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) నరేంద్ర మోడి అసలు స్వరూపం ఏమిటి? ఎన్నికల విజయం నాటి ఆరంభ పుష్టితో ఇస్లామాబాద్ కు స్నేహ హస్తం చాచి, తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆయనతో తమ తమ తల్లుల కోసం దుశ్శాలువలు, చీరలు ఇచ్చిపుచ్చుకున్న వ్యక్తా? లేక “సంప్రదాయ యుద్ధం చేయగల సామర్ధ్యాన్ని పాకిస్ధాన్ కోల్పోయింది.…

పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్

– ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ నూతన ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ తన స్నేహ హస్తాన్ని చాచారు.                                                        —-వార్త – పాకిస్ధాన్ లో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా భారత ప్రధాని ఇంకా ఏర్పడని నూతన ప్రభుత్వానికి స్నేహ హస్తం చాచారు. ఇన్నాళ్లూ పాకిస్ధాన్ ని పాలించిన ఆసిఫ్ జర్దారీ అధ్యక్షరికంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కొరవడిందీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ…