నల్ల ధనం సున్నా, అంచనా దాటిన పాత నోట్ల జమ

ప్రధాని మోడీ గారి డీమానిటైజేషన్ కధ దాదాపు కంచికి చేరినట్లే. పాత పెద్ద నోట్ల రద్దు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం, RBI లు దేశంలో ఎంత డబ్బు చలామణిలో ఉన్నదో చెప్పారు. వారి ప్రకారం రద్దు చేసిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లలో చలామణిలో ఉన్న మొత్తం 14.95 లక్షల కోట్లు. కొన్ని పత్రికలు 14.18 లక్షల కోట్లు అని చెబుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద అంకెనే తీసుకుందాం.  ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…

12.6 లక్షల కోట్లు జమ, ఇంకెక్కడి నల్ల ధనం?

ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రకటించిన ‘పాత అధిక విలువ నోట్ల రద్దు’ వల్ల ఆశించిన ఫలితం అలా ఉంచి కనీస ఫలితం కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు. “నల్ల డబ్బుని నిర్మూలించి డబ్బు నిల్వలను శుభ్రం చేసి, టెర్రరిజం ధన వనరులపై దెబ్బ కొట్టి, దొంగ నోట్లకు చోటు లేకుండా చేయడమే నోట్ల రద్దు లక్ష్యం” అని మొదట ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత ఈ లక్ష్యం పైన నిలబడకుండా మాటలు మార్చుతూ పోయినప్పటికీ జనం…

కొత్త నోట్లు: ఆరు నెలలు పడుతుంది -ఆర్ధికవేత్తలు

  RBI నోట్ల ముద్రణా సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే పాత నోట్ల స్ధానంలో కొత్త నోట్లను పూర్తి స్ధాయిలో ప్రవేశపెట్టడానికి 6 నెలల కాలం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన సౌమిత్ర చౌదరి చెప్పారు. కాగా ప్రధాని మోడీ నిర్ణయం వల్ల అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ అర శాతం తగ్గిపోతుందని జర్మనీ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ డ్యూష్ బ్యాంక్ AG అంచనా వేసింది.  బ్యాంకుల వద్ద…

నల్లడబ్బు వివరాలన్నీ చెప్పలేరట!

నల్ల డబ్బు కధ మరో చుట్టు తిరిగొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నల్లడబ్బు వివరాలను దాచి ఉంచడానికి ఏయే కతలు చెప్పారో సరిగ్గా అవే కధల్ని మన అవినీతి వ్యతిరేక ఛాంపియన్ అయిన నరేంద్ర మోడీగారి ప్రభుత్వం వినిపిస్తోంది. దేశం దాటి పోయి అనేక రహస్య స్విస్ ఖాతాల బంకర్లలో శత్రు దుర్భేద్యమై నక్కిన నల్లడబ్బుని మెడపట్టి లాక్కొచ్చి జనానికి అప్పజెపుతామని వీరాలాపాలు పలికిన మోడి గారి ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పిన మాటల్నే చిలక పలుకుల్లా వల్లిస్తోంది. ఎన్.డి.ఏ…

లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సీరియస్‌గా లేదు, మరోసారి నిరాహార దీక్ష చేస్తా! -అన్నా హజారే

కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా…

బాబా రామ్ దేవ్ ని అరెస్టు చేశారు, హరిద్వార్ కి తోలారు, దీక్ష ముగిసింది

భారత దేశ రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల అంతులేని అవినీతి పైన యుద్ధం ప్రకటించిన బాబా రామ్ దేవ్ ని అరెస్టు చేశారు. విదేశాల్లో దాచుకున్న అవినీతి డబ్బుని దేశానికి రప్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. 2014 లో ఓ రాజకీయ పార్టీ పెడతానని చెబుతున్న ఈయన కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని అసాధ్యమైన డిమాండ్లు కూడా ఉంచాడు. తాము అనుమతిని 5,000 మందికి యోగా శిక్షణ ఇస్తానంటే ఇచ్చామనీ, 50,000 మందిని తెచ్చి గొడవ చేయడానికి…

ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నించింది -అన్నా హజారే

భారత దేశంలోని ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్ దేవ్ జూన్ 4 తారీఖునుండి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారత దేశ రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు రహస్యంగా దాచుకున్న నల్ల ధనాన్ని భారత దేశానికి తిరిగి తెప్పించాలని ఆయన ప్రధాన డిమాండు. బాబా రామ్ దేవ్ తన దీక్షను ప్రారంభించడానికి బుధవారం ఢిల్లీకి ప్రయాణం కట్టగా ప్రధాని మన్మోహన్ సింగ్ దీక్ష ఆలోచనని విరమించుకోవాలని స్వయంగా రామ్ దేవ్‌కి విజ్ఞప్తి చేశాడు.…