డిప్రెషన్ బాధితురాలిని కాల్చి చంపిన అమెరికా పోలీసులు -ఫోటోలు

ఆమె డిప్రెషన్ బాధితురాలు. సంవత్సరంన్నర వయసు పాపకు తల్లి. డెంటల్ హైజీన్ నిపుణురాలు. బాలింతలకు వచ్చే డిప్రెషన్ తో బాధపడుతోంది. డిప్రెషన్ వల్లనే యేమో అక్టోబర్ 3 తేదీన వాషింగ్టన్ కేపిటల్ హిల్ ఏరియాలో వేగంగా కారు నడుపుతోంది. అధ్యక్ష భవనం దరిదాపుల్లో ఇలా ఓ కారు వేగంగా వెళ్ళడంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ఒక పోలీసు కారును పక్కకు మళ్లించి ఆపాలని కోరాడు. ఆమె ఆగలేదు. ఇక మొదలైంది వేట. పోలీసులు వీరావతారం ఎత్తారు. కారును…