ఉచ్ఛనీచాలు మరిచిన కొడుకుని చంపించిన తల్లిదండ్రులు

ఇదో హృదయ విదారకమైన కధ. తాగి అరాచకం సృష్టించడమే కాక తల్లితోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకుని ఎలా బాగు చేయాలో ఆ వృద్ధ దంపతులకు అర్ధం కాలేదు. కొడుకు తన జీవితం నాశనం కేస్య్కోవడమే కాక, తాగి వచ్చి కోడలిని విపరీతంగా కొడుతున్నా బలహీనులైన వృద్ధులు అడ్డుకోలేకపోయారు. దెబ్బలు తట్టుకోలేక కోడలు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోతున్నా ధైర్యం చెప్పి అండ నిలవలేకపోయారు. పనికి పోకుండా తాగి తందనాలాడుతూ డబ్బుల కోసం తమనే వేధిస్తుంటే సహిస్తూ బతికారు.…