సనాతన కుల-మత వ్యవస్ధ పునరుద్ధరణే కంగనా ప్రబోధిస్తున్న విముక్తి!

నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలపై కొంత స్పష్టత ఇచ్చారు. తాను అన్నీ తెలిసే 1947 నాటి స్వతంత్రంపై వ్యాఖ్యానించానని తన వివరణ ద్వారా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే తన ‘పద్మ శ్రీ’ అవార్డు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. దానికి ముందు తన అనుమానాలు తీర్చాలని ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు. తన అనుమానాలకు సంతృప్తికరంగా సమాధానం ఇస్తే అవార్డు ఇచ్చేస్తానని చెప్పారు. అయితే కంగనా రనౌత్ ఇచ్చిన వివరణ మరిన్ని…

నాలుగో వంతు ఎటిఎంలు ఖాళీ

నిపుణులు హెచ్చరించినట్లగానే, డీమానిటైజేషన్ కష్టాలు ప్రజలని ఇంకా వదలలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో (జనవరి వేతనాల కోసం) ఉద్యోగులు, మైక్రో-చిన్న-మధ్య తరహా పరిశ్రమల యజమానులు డబ్బు డ్రా చేశారు. దానితో బ్యాంకుల వద్ద కరెన్సీ నోట్లు నిండుకున్నాయి. ఎటిఎం లలో ఉంచేందుకు బ్యాంకుల వద్ద ఇక డబ్బు లేకపోవడంతో దేశంలో నాలుగో వంతు ఎటిఎం లు ఖాళీ అయిపోయాయి. ‘నో క్యాష్’ బోర్డులు అనేక ఎటిఎం ల ముందు వెక్కిరిస్తున్నాయి.  ఫిబ్రవరి 10 వరకు మాత్రమే ఈ…

పేదల కోసమే! -మోడీ కొత్త పాట

మొదట బ్లాక్ మనీ-ఉగ్రవాదం-దొంగ నోట్లపై పోరాటం అన్నారు; ఆ తర్వాత మారక వ్యవస్ధను డిజిటైజ్ చేయడమే లక్ష్యం అన్నారు’ ఇప్పుడు “పేద జనోద్ధరణ కోసమే” అంటున్నారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.  మంగళవారం లోక్ సభలో తన డీమానిటైజేషన్ చర్యను సమర్ధించుకున్న ప్రధాన మంత్రి “ఇది పేదల తరపున చేస్తున్న పోరాటంలో భాగమే” అని సెలవిచ్చారు. “ఇండియాను శుభ్రం చేసేందుకు డీమానిటైజేషన్ కు నిర్ణయించాము. పేదల అభ్యున్నతికే నేను చేసే పోరాటం. పేదలకు రావలసింది దక్కడం కోసం…

1% చేతిలో 58% దేశ సంపద -ఆక్స్ ఫామ్

ఆక్స్ ఫామ్ అన్నది బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్ధ. ఖచ్చితంగా చెప్పాలంటే 18 అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్ధల కాన్ఫెడరేషన్! అంతర్జాతీయంగా నెలకొన్న అసమానతలను అధ్యయనం చేసిన ఈ సంస్ధ భారత దేశంలో నెలకొన్న తీవ్ర అసమానతల గురించి కూడా తెలియజేస్తూ ఒక నివేదిక తయారు చేసి విడుదల చేసింది. (Scroll.in) ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో:   సంపద యాజమాన్యం రీత్యా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న 1 శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి…

నోట్ల రద్దు: టమాటో పంటను పశువులకు మేపుతున్న రైతులు

పెద్ద నోట్ల రద్దు వలన గట్టి దెబ్బ తిన్నవారిలో రైతులు ముఖ్యమైన వారు. ‘దేశానికి అన్నం పెట్టె రైతన్న’ అనీ, ‘దేశానికి వెన్నెముక’ అనీ ‘జై జవాన్, జై కిసాన్’ అనీ సవాలక్ష అలంకారాలతో రైతులను నెత్తిన పెట్టుకున్నట్లు కనిపించే ప్రభుత్వాలు ఆచరణలోకి వచ్చేసరికి రైతాంగాన్ని చావు దెబ్బ తీసే విధానాలను అమలు చేయటానికి ఎంత మాత్రం వెనకడుగు వేయరు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అటు ఖరీఫ్ రైతులు, ఇటు రబీ రైతులు ఇరువురూ తీవ్రంగా…

నల్ల ధనం సున్నా, అంచనా దాటిన పాత నోట్ల జమ

ప్రధాని మోడీ గారి డీమానిటైజేషన్ కధ దాదాపు కంచికి చేరినట్లే. పాత పెద్ద నోట్ల రద్దు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం, RBI లు దేశంలో ఎంత డబ్బు చలామణిలో ఉన్నదో చెప్పారు. వారి ప్రకారం రద్దు చేసిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లలో చలామణిలో ఉన్న మొత్తం 14.95 లక్షల కోట్లు. కొన్ని పత్రికలు 14.18 లక్షల కోట్లు అని చెబుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద అంకెనే తీసుకుందాం.  ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…

కొత్త నోట్లు: 2011 లోనే నిర్ణయం -అధికారులు

  సాధారణ పాలనా ప్రక్రియలో భాగంగా తీసుకునే నిర్ణయాలకు మసాలాలు అద్దడం, అబద్ధాలతో హైప్ సృష్టించడం, దేశానికీ ఎదో ఒరగబెట్టేసినట్లు నానా హంగామా చేయడం, పనిలో పనిగా మోడీ చుట్టూ కృత్రిమ ప్రతిష్టను నిర్మించడం, అవేవి వీలు కాకపొతే బాధితుడి పాత్రలోకి వెళ్ళిపోయి కన్నీళ్లు కార్చి సానుభూతి కోసం ప్రయత్నించడం..!  రు 500 , రు 1000 నోట్లు రద్దు చేయటం వెనుక లక్ష్యం నల్ల డబ్బుని వెలికి తీయడం అని కదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాన…

కొత్త నోట్లు: సెక్యూరిటీ నాణ్యత రెండు లేవు, అన్ని అబద్ధాలే!

  పాత, పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఏమిటి? దేశంలో నల్ల ధనం పేరుకుపోయింది. ధనిక వర్గాలు, మనీ లాండర్లు, హవాలా రాకెటీర్లు, సమాంతర ఆర్ధిక వ్యవస్ధని నడుపుతున్నారు. సరిహద్దుల అవతలి నుండి దొంగ నోట్లు ముద్రించి దేశంలోకి వదులుతున్నారు. ఫలితంగా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం కలుగుతోంది. పేదలు ఎక్కువగా నష్టపోతున్నారు. సమానత్వం సాధించలేకపోతున్నాము. నల్ల డబ్బు జీడీపీ వృద్ధి రేటు పెంచుకోవటానికి ప్రధాన ఆటంకం అయింది. ఇక…

సర్జికల్ స్ట్రైక్: దిష్టి బొమ్మదే క్రెడిట్! -కార్టూన్

  “ఛాతీలు గుద్దుకోవద్దని ప్రధాని మోడీ ఆదేశించారు.” వారం పది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశం నుండి బైటికి వచ్చాక కేబినెట్ మంత్రులు చెప్పిన మాట ఇది.  కానీ అప్పటి నుండి ఛాతీలు గుద్దుకోవడం, భుజాలు చరుచుకోవడం పెరిగిందే గానీ తగ్గలేదు. నిన్నటికి నిన్న రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ తన ఛాతీ తాను గుద్దు  కోవడంలో కొత్త పుంతలు తొక్కారు. ఆయన తెలివిగా తనతో పాటు ప్రధాని మోడీని కూడా కలిపి సర్జికల్ స్ట్రైక్స్…