బ్లాక్ మనీ: హస్తిమశకాంతరం -కార్టూన్

“హస్తిమశకాంతరం” అని తెలుగులో ఒక పదబంధ ప్రయోగం ఉంది. హస్తి అంటే ఏనుగు; మశకం అంటే దోమ. ఏనుగుకు, దోమకు ఉన్నంత తేడా అని దీని అర్ధం. మొన్న మన ఆర్ధిక మంత్రి గారు, సగర్వంగా -ప్రధాన మంత్రి మోడి ప్రశంసల మధ్య- ప్రకటించిన నల్ల డబ్బుకీ, ఎన్నికలకు ముందు మోడి ప్రకటించిన నల్ల డబ్బు అంచనాకు మధ్య ఉన్న తేడాను ఈ పదబంధంతో చెప్పవచ్చు. తమ ఐ‌డి‌ఎస్ (ఆదాయ ప్రకటన పధకం) స్కీం ద్వారా 65…

బలూచిస్తాన్ స్వతంత్రంకు మద్దతు ఇవ్వం -అమెరికా

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎర్ర కోట ప్రసంగం నాడు సృష్టించిన దుమారాన్ని అమెరికా చప్పున చల్లార్చింది. బలూచిస్తాన్ ప్రజల పోరాటాలకు ప్రధాని మోడి మద్దతు ఇస్తున్నట్లుగా భారత పత్రికలు తీసిన అర్ధం నిజం కాదని అమెరికా ఇచ్చిన వివరణ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతకు అమెరికా కట్టుబడి ఉన్నదనీ, బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి తాము మద్దతు ఇచ్చేది లేదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. “మా ప్రభుత్వ విధానం ఏమిటంటే పాకిస్తాన్…

పాక్ వరద గేటు తెరిచిన మోడి బలోచ్ వ్యూహం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల పెట్టిన వ్యూహం -కాంగ్రెస్ ఆరోపించినట్లుగా- ఇండియాకే బెడిసి కొట్టేట్లు కనిపిస్తోంది. 69వ స్వతంత్ర దినం నాడు బలోచిస్తాన్ ప్రజల పోరాటాన్ని మన ప్రధాని ప్రస్తావించినందుకు ప్రతీకారంగానా అన్నట్లుగా కాశ్మీర్ విషయంలో పూర్తి స్ధాయి అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి పాకిస్ధాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నడుం బిగించారు. కాశ్మీర్ సమస్య విషయమై తమ వాదన వినిపించడానికి వివిధ దేశాలకు ఆయన దౌత్యవేత్తలను పంపించారు. కాశ్మీర్ సమస్యను ఇతర దేశాలకు…

గో రక్షణ క్రిమినల్ ముఠాలను శిక్షించరా?!

“అహో! మొదట ఈ గందరగోళమునందేల ప్రవేశించవలే?! ప్రవేశించితిపో…!” ********* ఇంతకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నోరు తెరవడం కూడా మహా భాగ్యమే అన్నమాట! దేశంలో చెలరేగుతున్న ఆందోళనలకు, మండుతున్న మంటలకు ప్రధాన మంత్రి స్పందన ‘ప్రధాని కూడా స్పందించారు’ అని చెప్పుకోవడానికా లేక ఆ స్పందన కార్యరూపం లోకి దాల్చుతుంది అని జనం నమ్మడానికా? “ప్రధాని స్పందించారు. ఇంకేం కావాలి? స్పందనపై గొడవ చేయడం ఎందుకు?” అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ప్రశ్నిస్తుంటే…

దళిత ఓటు: మోడి ‘అఖిల్లెస్ హీల్’ -కార్టూన్

మోడి రాజకీయాలు, దళిత ఓట్లు మధ్య నెలకొన్న సంబంధాన్ని వివరించడానికి, బహుశా, ఇదే గొప్ప పోలిక! ముందు అఖిల్లెస్ హీల్ అంటే ఏమిటో చూద్దాం. ఇది చాలా మందికి తెలిసి ఉండవచ్చు, ఐనా రికార్డు కోసం, తెలియని వాళ్ళ కోసం, వివరిస్తాను. గ్రీకు పురాణాల్లో అఖిల్లెస్ ఒక పాత్ర. మహాభారతంలో దుర్యోధనుడి తొడలతో అఖిల్లెస్ పాదాన్ని పోల్చవచ్చు. అఖిల్లెస్ పుట్టుక నాడు అతను యవ్వనంలోనే చనిపోతాడని జ్యోతిష్కులు చెబుతారు. ఆమె తల్లి ధేటీస్ అతన్ని శక్తివంతుడ్ని చేయాలని…

స్వామి జీనీని వదిలారు, అనుభవిస్తున్నారు! -కార్టూన్

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ నేతలపై, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్న సుబ్రమణ్య స్వామి ఇటీవల చూపు తిప్పారు. పైకి ఆర్ధిక శాఖ నియమిత అధికారులను లక్ష్యం చేస్తూ లోపల ఆర్ధిక మంత్రి జైట్లీని సాధిస్తున్నారు. సుబ్రమణ్య స్వామి ఓ శుభ దినాన ఆర్‌బి‌ఐ గవర్నర్ రఘురాం రాజన్ ను లక్ష్యంగా చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా దూషణలు రువ్వటం ప్రారంభించినపుడు ఆయన లక్ష్యం ఎవరో త్వరగా అర్ధం కాలేదు. తన దూషణల్లో…

మృత జవాన్లకు సానుభూతికూడా ట్విట్టర్ తోనేనా?

“మహారాష్ట్ర, పులగావ్ వద్ద సెంట్రల్ ఆమ్యూనిషన్ డిపోలో మంటలకు ప్రాణాలు నష్టపోవడం బాధ కలిగిస్తోంది. నా ఆలోచనలు బాధితులతో ఉన్నాయి.” అని ఒక ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు. “గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ఆర్‌ఎం మనోహర పరికర్ ఘటనా స్ధలిని సందర్శించి పరిస్ధితిని సమీక్షించాలని కోరాను” అని మరో ట్వీట్ లో ప్రధాని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా కాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ప్రకటన వెలువడినట్లుగానీ, అందినట్లుగానీ ఏ పత్రికా…

గత ప్రభుత్వాలూ కృషి చేశాయి -దారి తప్పిన మోడి

అస్సాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో బి‌జే‌పి మొదటి సారిగా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేకమంది కేబినెట్ మంత్రులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఈ వార్తలో విశేషం ఏమీ లేదు. ప్రధాన మంత్రి ప్రసంగంలో దొర్లిన కొన్ని మాటలే అసలు విశేషం. “స్వతంత్రం అనంతరం గతంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా కూడా, ప్రతి…

#పోబిడ్డామోడి! -కేరళీయుల తిరస్కారం

‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అని సామెత. ‘కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది’ ఇది కూడా సామెతే. 2014 సాధారణ ఎన్నికల్లో మొదటి సారి సంపూర్ణ మెజారిటీతో బి‌జే‌పిని అధికారంలోకి తెచ్చే వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మొదటి సామెతలో లబ్ది పొందారు. అధికారం చేపట్టాక మోడి దశ తిరిగినట్లే పరిణామాలు జరుగుతున్నాయి. 28 సీట్లు గెలిచిన ఢిల్లీ అసెంబ్లీలో రెండంటే రెండే సీట్లు దక్కించుకుని అతి చిన్న ఏ‌ఏ‌పి పార్టీ…

ఇదిగో డిగ్రీ పట్టా -బి‌జే‌పి; అబ్బే ఫేక్ -ఏ‌ఏ‌పి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బి‌ఏ పట్టా వ్యవహారం రసకందాయంలో పడింది. బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలు ప్రత్యేకంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ‘ఇవిగో ప్రధాని పట్టాలు’ అని ప్రదర్శించారు. ఏ‌ఏ‌పి నేత కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏ‌ఏ‌పి వెనక్కి తగ్గలేదు. అమిత్ షా, అరుణ్ జైట్లీల విలేఖరుల సమావేశం ముగిసిన నిమిషాల లోనే తానూ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టాలలో…

అరవిందా మోడీయా ఎవరు బెటరు?

విశేషజ్ఞ గారి వ్యాఖ్య: – కాషాయం గ్యాంగుకి సోషల్ మీడియా సైట్లలో ఉన్న బలగంతో అరవింద్‌ని unpopular చేస్తున్నారేగానీ, నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో అతిపెద్ద failure మన గౌరవనీయులైన PM గారు. ఆయనిచ్చిన వాగ్దానాల్లో ఆయన ఎన్నింటిని నిలబెట్టుకున్నరో లెక్కలేస్తే, అధికారంలోకి రాగానే తన వాగ్దానాలమీద దృష్టిసారించి వాటిని నిలుపుకున్న అరవింద్ మేరుపర్వతమంత ఎత్తున కనిపిస్తాడు (మన కాషాయ నేత పుట్టగొడుగంత ఉండొచ్చు). అరవింద్‌కూడా రాజకీయం చేస్తున్నాడు కాదనను. మరి అంత కంటే కూటరాజకీయం PM చేస్తున్నప్పుడు…

సోనియా అంటే మోడీకి భయం -కేజ్రీవాల్

అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆం ఆద్మీ పార్టీ ఈ రోజు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. ఏ‌ఏ‌పి నేతలు అనేకమంది పాల్గొన్న ఈ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ర్యాలీకి ముందుగా జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ప్రసంగంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఉబుసుబోక ప్రసంగాలను నిలువునా చీరేశారు.…

ఒక నిస్సహాయ పరిస్ధితి -ది హిందు ఎడ్..

[ఏప్రిల్ 26, 2016 తేదీన ది హిందూలో ప్రచురితం అయిన ఎడిటోరియల్  “A Desperate situation” కు యధాతధ అనువాదం] ********* మితి మీరిన భారం, సిబ్బంది లేమిలతో కూడిన భారతీయ న్యాయ వ్యవస్ధలో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండడం అందరూ ఎరిగిన విషయం. ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ భావావేశంతో చేసిన విజ్ఞాపన ఈ సమస్యకు తీవ్రతను, తక్షణమే దృష్టి పెట్టవలసిన ఆవశ్యకతను…

అసలు సమస్యలను తప్పించిన JNU-అఫ్జల్ రగడ!

ఏది దేశ ద్రోహం? ఏది దేశభక్తి? నిత్యం భావ సంఘర్షణలు జరిగే సమాజంలో ఉక్కు ద్రావకాన్ని పోత పోసి ఆరబెట్టినట్లుగా దేశభక్తి, దేశద్రోహం ఉండగలవా? ఉనికిలో ఉన్న మనుషులు అందరికీ ఒకటే దేశ భక్తి, ఒకటే దేశ ద్రోహం ఉండగలవా? మనిషి మెదడు వేనవేల ఆలోచనలకు నిలయం. మనిషి సామాజిక ఆచరణ ఎన్ని పోకడలు పోతుందో అన్ని పోకడలూ పొందగల వేలాది సంభావ్యతలు (probabilities) మనిషి మెదడులో వీరంగం ఆడుతుంటాయి. సమూహంలోని మనుషుల సామాజిక ఆచరణలో ఉమ్మడితనం…

మోడి పాస్ పోర్ట్: యశోదాబెన్ ఆర్‌టి‌ఐ దరఖాస్తు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తన భార్యగా ఎన్నికల నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న శ్రీమతి యశోదా బెన్ కు తమ పెళ్లి నిజంగానే జరిగిందని రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిపడింది. శ్రీమతి యశోదా బెన్ ను తన భార్యగా ప్రధాన మంత్రి పేర్కొన్న సంగతి పత్రికల ద్వారా తెలియడమే. అంతే తప్ప వాస్తవంగా పెళ్ళి జరిగిందని రుజువు చేసే రికార్డులు శ్రీమతి యశోదా బెన్ వద్ద లేవని ఆమెకు ఎదురయిన తాజా పరిస్ధితి ద్వారా అర్ధం అవుతున్నది.…