Bulli Bai ఆప్: నిర్ఘాంతపోయే నిజాలు!

ముంబై పోలీసుల పుణ్యమాని బుల్లి బాయ్ ఆప్ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సల్లీ డీల్స్ ఆప్ కేసులో గత జులై నెలలో బాధితులు, ఢిల్లీ వుమెన్ కమిషన్, విలేఖరులు వెంటపడి వేడుకున్నా నిందితులను పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది చొరవతో ముంబై పోలీసులు కేసును వేగంగా ఛేదిస్తున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలే కేసు వివరాలు కొన్నింటిని విలేఖరులకు వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురు…

మోడి అహంకారి! -మేఘాలయ గవర్నర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అహంకారి అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ అభివర్ణించారు. రైతుల సమస్య గురించి చర్చించడానికి వెళితే ఇద్దరం వాదులాడుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. (ఇండియన్ ఎక్స్^ప్రెస్, జనవరి 3, 2022) బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అదురు బెదురు లేకుండా విమర్శించే బి‌జే‌పి నేతల్లో సత్య పాల్ మాలిక్ ఒకరు. రెండు అధికార కేంద్రాలు (నరేంద్ర మోడి, ఆర్‌ఎస్‌ఎస్) ఉన్న చోట…

మోడీ కుట్ర విప్పి చెప్పిన సాహసికి లేఖ

గుజరాత్ మారణకాండలో నరేంద్ర మోడీ హస్తం సాక్ష్యాధారాలు బైటపెట్టాడన్న కోపంతో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ భట్ ను ఒక పాత కేసులో ఇరికించి ముప్పై సంవత్సరాల శిక్ష వేసిన సందర్భంలో హర్ష్ మందర్ రాసిన లేఖ. (వీక్షణం జూలై 2019 సంచిక నుంచి) – హర్ష్ మందర్, IAS (తెలుగు: ఎన్ వేణుగోపాల్) ప్రియమైన సంజీవ్, ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి…

పీఎం కేర్స్ ఫండ్ లోగో లో ప్రధాని బొమ్మ తీసెయ్యండి -పిటిషన్

బాంబే హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. PM CARES ఫండ్ ఎంబ్లమ్ లో నుండి ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ, జాతీయ జెండా బొమ్మ వెంటనే తొలగించాలని ఈ పిటిషన్ సారాంశం. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎం ఎస్ కార్నిక్ లతో కూడిన బెంచి ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. విచారణ క్రిస్మస్ సెలవుల తర్వాత తేదికి వాయిదా వేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోరారు. “ఇది ముఖ్యమైన పిటిషన్ మిస్టర్…

రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!

హిందూత్వ అహంభావ పాలకులపై చావు దెబ్బ కొట్టిన ‘భారతీయ’ రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల సంయుక్త పోరాట వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కే‌ఎం) నేతలు విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఆమోదం చెప్పడంతో శనివారం, డిసెంబర్ 9 తేదీన ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరవధిక ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బనాయించిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది.…

2+2 ఫార్మాట్ చర్చలు అంటే?

భారత విదేశాంగ విధానంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట “2+2 ఫార్మాట్ డైలాగ్” (2+2 నమూనా లో జరిగే చర్చలు)! సాధారణ పాఠకుల్లో చాలా మందికి ఈ పద బంధం అర్ధం ఏమిటన్నది తెలియదు. తెలియని అంశాల కోసం ఇంటర్నెట్ ని వెతికి చదివే అలనాటు ఉన్నవాళ్లకి తప్ప ఇతరులకి తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ పద బంధాన్ని విదేశాంగ విధానం, విదేశీ సంబంధాల రంగంలో ఉపయోగిస్తారు. ఈ పేరే దాని అర్ధం ఏమిటో చెబుతోంది.…

5 ని.ల్లో రద్దు బిల్లు మూజువాణి ఆమోదం, నోటితో నవ్వుతూ…

పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమ నిబంధనలు, నియమావళి, సుస్ధిర ప్రక్రియలు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. దాదాపు ఆరున్నర దశాబ్దాల పార్లమెంటరీ ఆచరణలో తామే నెలకొల్పుకున్న సో-కాల్డ్ ప్రజాస్వామిక సభా సూత్రాలు రద్దయిపోతూ వాటి స్ధానంలో పార్లమెంటరీ నియంతృత్వ సూత్రాలు ప్రవేశిస్తున్నాయి. ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న సభ్యులు నిరసనలను గౌరవించడం మాట అటుంచి కనీసం పట్టించుకోవడమే ఒక గొప్ప అంశంగా మారే రోజులు వచ్చాయి. ప్రజాస్వామ్య దేవాలయంగా ఇన్నాళ్లూ మన పాలకులు డప్పు కొట్టుకున్న పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులు…

క్షమించండి! వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తాను! -మోడి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల వంచాడు. కాదు, కాదు. భారత రైతులే ఆయన తల వంచారు. మోడి నేతృత్వం లోని బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు సంవత్సర కాలంగా ఎండనకా, వాననకా జాతీయ రహదారులపై ఆందోళన చేస్తున్న రైతాంగం ఎట్టకేలకు అపూర్వ విజయం సాధించింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టినాక కూడా పత్రికలతో ఏనాడూ మాట్లాడి…

కంగనా రనౌత్ తెలిసి మాట్లాడతారా లేక…!?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి మరో వివాదంలో కేంద్ర బిందువుగా నిలిచారు. ఏకంగా భారత దేశ స్వాతత్ర్య దినం పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారామె. ఆర్ణబ్ గోస్వామి కేకలకు, పెడబొబ్బలకు గతంలో అవకాశం ఇచ్చిన టైమ్స్ నౌ చానెల్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.కొందరు బి‌జే‌పి నేతలు కూడా ఆమె అవగాహనా రాహిత్యాన్ని తిట్టిపోస్తున్నారు. గురువారం జరిగిన ఈవెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానం…

విచారణ చెయ్యకుండానే మోడికి క్లీన్ చిట్ -జకీయా జాఫ్రీ వాదన

గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ రాష్ట్ర వ్యాపితంగా ముస్లింలపై జరిగిన మారణకాండ విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. క్లీన్ చిట్ పై నిరసన పిటిషన్ దాఖలు చేసిన జకీయా జాఫ్రీ తరపున అడ్వకేట్ కపిల్ సిబాల్ తన వాదనలు ఈ రోజు కొనసాగించారు. జాఫ్రీ చేసిన ఫిర్యాదుపై అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై పరిశోధన జరపకుండానే…

కస్టమ్స్ సుంకం తగ్గించి ట్రంప్ కి ఫోన్ చేసిన మోడి

ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రుల (కేబినెట్) విధాన నిర్ణయాలు ఎవరి ప్రయోజనం కోసం ఉద్దేశించబడి ఉండాలి? ఈ ప్రశ్నకు జవాబు చాలా సులభం. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు విధానాలు రూపొందించి అమలు చేయాలి. విదేశాలు, విదేశీ కంపెనీల మరియు విదేశీయుల పెట్టుబడుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం పని చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే దేశద్రోహం అవుతుంది. భారత దేశ రక్షణ కోసం పని చేసే ఆర్మీ-నేవీ-ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ రహస్యాలను విదేశాలకు అందజేస్తే…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -1

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఆల్పైన్ పర్వతాల లోని విడిది నగరం దావోస్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సమావేశాలు జరుగుతున్నాయి. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి కూడా ఈ సమావేశాలకు హాజరై ప్రారంభ ప్రసంగం చేసి వచ్చాడు. మోడీతో పాటు పలు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు కూడా వేదికపై ప్రసంగాలు చేస్తున్నారు. 2000 సం. తర్వాత మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశాలకు హాజరవుతున్నాడు. అందుకు అమెరికాకు కారణాలు ఉన్నాయి. అధ్యక్షుడు…

ఎకనమిక్ సర్వే 2018: 10 ప్రధాన అంశాలు

జనవరి 29 తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే – 2018, 10 ప్రధాన అంశాలను గుర్తించింది. ఇవి భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణీయన్ దృష్టిలో ప్రధానమైనవి. ‘పది కొత్త ఆర్ధిక నిజాలు’ అని సర్వే వీటిని అభివర్ణించింది.  ప్రజల వైపు నుండి చూసినపుడు ప్రధానం కావచ్చు, కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నియమించుకున్న సలహాదారు కనుక ఈ అంశాలు పాలకవర్గాల దృక్కోణం నుండి ప్రధాన అంశాలుగా ఉంటాయని గుర్తించడం సబబు.…

ఆరోసారి ముఖ్యమంత్రి పీఠంపై అవకాశవాద నితీష్

జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నేత నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆరవ సారి పదవీ స్వీకార ప్రమాణం చేశాడు. రాజకీయ నీతికి అసలు సిసలు చిరునామాగా చెప్పుకునే ఈ పెద్ద మనిషి తాను “ఛీ, ఫో” అని తిట్టిపోసిన మోడి నేతృత్వ బి‌జే‌పితోనే మళ్ళీ జట్టు కట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాడు. పక్కా పదవీ వ్యామోహాన్ని బాధ్యత నిర్వహణగా చెప్పుకుంటూ, పచ్చి రాజకీయ అవినీతికి నీతి రంగు పులుముతూ రాజకీయ భ్రష్టత్వంలో తాను ఎంత మాత్రం…

బి‌జే‌పి నేతల వైభోగాన్ని ఆపలేని వెడ్డింగ్ బిల్లు!

ఓ పక్క ప్రధాన మంత్రి వృధా ఖర్చు చేయొద్దని బోధిస్తారు. డీమానిటైజేషన్ ద్వారా నల్ల డబ్బు నిరోధించానని చెప్పుకుంటారు. అట్టహాసంగా జరిగే పెళ్లిళ్ల ఖర్చులపై పరిమితి విధించేందుకు కాంగ్రెస్ ఎం‌పి ప్రతిపాదించిన బిల్లును బి‌జే‌పి ప్రభుత్వ కేబినెట్ తానే స్వయంగా ఆమోదించి సభలో పెడుతుంది. మరో పక్క ఆ బి‌జే‌పి ఎం‌పిలే నల్ల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అంగరంగ వైభోగంగా పెళ్లిళ్లు కానిచ్చేస్తుంటారు. ‘కోటలు దాటే మాటలు, గడప దాటని చేతలు’ సామెతకు అచ్చమైన ప్రతినిధులు…