కావేరి ఎన్నికల యజ్ఞం: బీజేపీ పిల్లి మొగ్గలు!

  కావేరి జలాల పంపిణి వివాదం చుట్టూ  ప్రస్తుత కర్ణాటక రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. పార్టీలు సహేతుకతను కావేరి నీళ్లలో కలిపేసాయి. వీలయినంత గరిష్టంగా రాజకీయ లబ్ది పొందేందుకు ఎత్తులు పై ఎత్తులు రచించి అమలు చేయడంలో నిమగ్నం అయ్యాయి. ఈ ఎత్తులు పై ఎత్తుల ఆటలో తనకు ఏది లాభమో అర్ధం కాక బీజేపీ పిల్లి మొగ్గలు వేస్తూన్నది  కావేరి జలాల సంక్షోభంలో తాము కర్ణాటక ప్రయోజనాలకు ఇతర పార్టీల కంటే అధికంగా కట్టుబడి ఉన్నామని చాటుకోవటానికి…