ఢిల్లీలో కేజ్రీ-జంగాసన -కార్టూన్

జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినం (International Day of Yoga) గా జరపనున్నారు. గత సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తూ ఐరాస యోగా దినం ప్రకటించింది. సొంత ప్రచారానికి, జబ్బలు చరుచుకోడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలని బి.జె.పి, నరేంద్ర మోడిలు ఐ.డి.వై ప్రకటనను కూడా తమ విజయంగా చాటుతున్నారు. ఐ.డి.వై నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి కార్యక్రమాలు రూపొందించారు. జూన్ 21…

ఢిల్లీ ఎ.సి.బి అదుపుకు కేంద్రం ప్రయత్నాలు!

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిత్వంలో, ఎ.ఎ.పి-1 పాలనలో, భారత దేశంలో అత్యధిక ధనికుడైన ముఖేష్ అంబానీపై ఢిల్లీ ఎ.సి.బి అవినీతి కేసు నమోదు చేసింది. అప్పటి కేంద్ర చమురు మంత్రి వీరప్ప మొయిలీ, ఇంకా ఇతర అధికారులపై కూడా అప్పటి ప్రభుత్వం అవినీతి కేసు నమోదు చేసింది. పలువురు ప్రముఖులు చేసిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎ.ఎ.పి ప్రభుత్వం ముఖేష్ అంబానీ, వీరప్ప మొయిలీ, మురళి దియోరా, వి.కె.సిబాల్ లపై నమోదు చేసిన కేసు వివరాల కోసం కింది…

ఢిల్లీ కోర్టు రూలింగ్: మోడిపై ఎఎపి గెలుపు

ఒక హెడ్ కానిస్టేబుల్ అవినీతి కేసులో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎఎపి మొదటి గెలుపు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఎఎపి ప్రభుత్వం చేతుల్లో నుండి అధికారాలు గుంజుకోవడానికి గత కొద్ది వారాలుగా మోడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పు కళ్ళెం వేసింది. ఢిల్లీ పోలీసులపై…