నగదు బదిలీ: మోడి చెప్పింది అబద్ధం! -కాగ్

అబద్ధం! అబద్ధం!! అబద్ధం!!! తమ ప్రభుత్వం గొప్పతనాల గురించి, సాధించిన బృహత్కార్యాల గురించి బి‌జే‌పి నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలే. జి‌ఎస్‌టి బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలోనే అబద్ధం ఆడేస్తారు. నగదు బదిలీ పధకం దేశానికి భలే ఒరగబెట్టిందని చెప్పడానికి ప్రధాన మంత్రి చాలా తేలికగా వేల కోట్ల అబద్ధాన్ని ఆడేస్తారు. బి‌జే‌పి ప్రభుత్వ నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ అబద్ధాల కార్యక్రమానికి నాయకత్వం వహించడం ఒక విడ్డూరం. అత్యున్నత…

బడ్జెట్ 2016: పాపులిస్టు ముసుగులో సంస్కరణలు -2

విద్య, ఆరోగ్యం, కుటుంబ, స్త్రీ శిశు సంక్షేమం ఈ రంగాలకు కేటాయింపులు భారీగా పెంచినట్లు మోడి-జైట్లీ బడ్జెట్ చూపింది. బడ్జెట్ లో భారీ కేటాయింపులు చూపడం ఆనక చడీ చప్పుడు కాకుండా సవరించి కోత పెట్టడం మోడి మార్కు ‘బడ్జెట్ రాజకీయం’. వివిధ శాఖల్లోని అంకెలను కలిపి ఒకే హెడ్ కింద చూపుతూ భారీ కేటాయింపులు చేసినట్లు చెప్పుకోవడం కూడా మోడి మార్కు మాయోపాయం. ఉదాహరణకి స్త్రీ, శిశు సంక్షేమం కింద బడ్జెట్ లో చూపినదంతా స్త్రీ,…

బడ్జెట్: జైట్లీ చదవని భారీ సంస్కరణలు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన నోటితో చదవని భారీ సంస్కరణలు బడ్జెట్ లో దండిగానే ఉన్నాయి. ఆంగ్లంలో బిగ్ టికెట్ రిఫార్మ్స్ గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పిలిచే ఈ సంస్కరణలే బడ్జెట్ అసలు సారాంశం. జనం మెచ్చే కేటాయింపులు సభలో చదివి తక్షణం ప్రతిపక్షాలు, ప్రజల నుండి విమర్శలు ఎదురయ్యే ప్రతిపాదనలను చదవకుండా ఆర్ధికమంత్రి జాగ్రత్తపడ్డారు. తద్వారా పేదలది ఎంతమాత్రం కాని బడ్జెట్ ని “ఇది పేదల బడ్జెట్” అని ప్రధాని నిరభ్యంతరంగా ప్రకటించే…

బియ్యం బదులు తూకం రాళ్ళు మింగించేదే ‘నగదు బదిలీ పధకం’ -కార్టూన్

నగదు బదిలీ పధకం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా ఊదగరగొడుతూ వచ్చాయి. ఈ పధకాన్ని ఆచరణలోకి తెస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కూడా ప్రకటించాడు. పేదలకు సబ్సిడీ ధరలకు సరుకులను అందించే బదులు సదరు సబ్సిడీని నగదు రూపంలో నేరుగా పేదల ఖాతాల్లోకి తరలించడమే ఈ పధకం లక్ష్యం. అంటే గ్యాస్ సిలిండర్, బియ్యం, రేషన్ సరుకులు తదితర సరుకలకీ ఇచ్చే సబ్సిడీని ఆయా సరుకులు కొనే సమయంలో ఇవ్వకుండా, సదరు…