బ్రెగ్జిట్: ఎగువ సభలో ధెరెసా పాక్షిక ఓటమి -విశ్లేషణ

బ్రిటిష్ ప్రధాని ధెరెసా ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్) లో పాక్షిక ఓటమిని ఎదుర్కొన్నారు. ప్రధాని ప్రతిపాదించిన బ్రెగ్జిట్ బిల్లు దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) లో యధాతధంగా ఆమోదం పొందగా ఎగువ సభలో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన సవరణతో ఆమోదం పొందింది. బ్రెగ్జిట్ తీర్పు అమలు చేసే విషయంలో ఆమె రచించిన పధకానికి ఈ ఓటమి వల్ల ఆటంకాలు ఎదురుకానున్నాయి. బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభం ఆలస్యం కావచ్చు. లార్డ్స్ సభలో బ్రెగ్జిట్…

బ్రెగ్జిట్ చర్చలు 2017 మార్చిలో మొదలు -ప్రధాని

బ్రిటిష్ ప్రజల తీర్పు ‘బ్రెగ్జిట్’ ను అమలు చేసే ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం అవుతుందని బ్రిటిష్ ప్రధాని ధెరెసా మే ప్రకటించారు. కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ ను ప్రారంభిస్తూ ధెరెసా చేసిన ప్రకటన బ్రెగ్జిట్ విషయమై కాస్త స్పష్టత ఇచ్చిందని యూరోపియన్ యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా బ్రిటన్ లోని బ్రెగ్జిట్ వ్యతిరేకులు సణుగుడు కొనసాగించారు. బ్రెగ్జిట్ ఓటింగ్ ముందు వరకు ‘రిమైన్’ (ఈ‌యూ లో కొనసాగాలి) శిబిరంలో ఉన్న…

బ్రెగ్జిట్ వ్యతిరేకి చేతుల్లో బ్రెగ్జిట్!

యూకె లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈయూ నుంచి విడాకులు తీసుకునే కార్యక్రమం బ్రెగ్జిట్ అనుకూల రాజకీయ నాయకుల చేతుల మీదుగా జరగవలసి ఉండగా అది కాస్తా ఇప్పుడు బ్రెగ్జిట్ వ్యతిరేకుల చేతుల మీదుగా జరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి పరిస్ధితి ఏర్పడటం కాదు, అదే జరగబోతోంది కూడా. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన ప్రచారానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ…