క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

ధాన్యం ఎగుమతికి పచ్చ జెండా ఊపిన కేంద్రం?

ధాన్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక రాసింది. గోదాముల్లో ఖాళీ లేక ఆరుబైట నిలవ చేయవలసి వస్తున్నదనీ, ఆరుబైట ఉంచడంతో ఎండా వానలకు చెడిపోతున్నాయనీ చెబుతూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ దాదాపు సంవత్సరం నుండీ ఎగుమతి చేద్దాం అని పోరుతూ వచ్చాడు. మిల్లర్లతో ఉన్న గాఢమైన అనుబంధం ఆయన్ను దేశంలో జనాలకి ధాన్యం అవసరం ఉందన్న స్పృహ కంటే విదేశాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఎగుమతులకు ఇదే…

ఆసియా దేశాల ఆర్ధికాభివృద్ధికి ఆహారధరలు ఆటంకం -ఏడిబి

ఇప్పటివరకు అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఆసియా దేశాల్లో పెరుగుతున్న ఆహార ధరల కారణంగా ఆర్ధికాభివృద్ధికి పెను సవాళ్ళు ఎదురు కానున్నాయని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) హెచ్చరించింది. ఆహార ధరలు అంతకంతకూ పెరుగుతు పోతుండడం వలన ఇప్పటికే బలహీనమైన కోలుగోలు శక్తితో దరిద్రం అనుభవిస్తున్న పేదల పరిస్ధితి మరింతగా దిగజారుతుందని ఎడిబి తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ఆసియా దేశాల జిడిపి కనీసం 1.5 శాతం మేర తగ్గే అవకాశం…

వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావని శరద్ పవార్

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కి వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావక మరోసారి నోరు విప్పారు. వరి, గోధమల ధరలు ప్రపంచ మార్కెట్ లో ఆశాజనకంగా ఉన్నాయని, నిల్వలు కూడా అధికంగా ఉన్నాయి కనుక ఎగుమతి చేయడానికి ఇదే సరైన సమయమని, ప్రభుత్వం వరి, గోధుమ ధాన్యాల ఎగుమతులకు అనుమతించాలని ఆయన పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉంటూ, అందునా వ్యవసాయ మంత్రిగా ఉంటూ పత్రికాముఖంగా డిమాండ్ చేయడం…