నగదు బదిలీ: మోడి చెప్పింది అబద్ధం! -కాగ్

అబద్ధం! అబద్ధం!! అబద్ధం!!! తమ ప్రభుత్వం గొప్పతనాల గురించి, సాధించిన బృహత్కార్యాల గురించి బి‌జే‌పి నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలే. జి‌ఎస్‌టి బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలోనే అబద్ధం ఆడేస్తారు. నగదు బదిలీ పధకం దేశానికి భలే ఒరగబెట్టిందని చెప్పడానికి ప్రధాన మంత్రి చాలా తేలికగా వేల కోట్ల అబద్ధాన్ని ఆడేస్తారు. బి‌జే‌పి ప్రభుత్వ నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ అబద్ధాల కార్యక్రమానికి నాయకత్వం వహించడం ఒక విడ్డూరం. అత్యున్నత…

రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత

ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్మూలను అనుసరిస్తూ రిలయన్స్ కంపెనీ వెలికి తీస్తున్న గ్యాస్ ధరను యు.పి.ఏ రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. సదరు పెంపును తగ్గిస్తూ ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.రంగరాజన్ రూపొందించిన ఫార్ములాను ఆమోదించడానికి ఎన్.డి.ఏ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో వేచి చూడాల్సిన విషయం. కె.జి. బేసిన్ లో గ్యాస్ వెలికి తీస్తున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్…