వడ్డీ రేటు పెంచిన ఆర్.బి.ఐ, ప్రభుత్వం కినుక

ఆర్.బి.ఐ అధినేత మారినా కూడా రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకాన్ని చప్పట్లతో ఆహ్వానించిన కార్పొరేట్, పరిశ్రమల వర్గాలు ఆయన వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలతో మింగలేక, కక్కలేక గొణుగుడుతో సరిపెట్టుకుంటున్నారు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు) ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఏమి అనలేక నిశ్శబ్దమే స్పందనగా మిగిలిపోయారు. ప్రధాన…

ద్రవ్య సమీక్ష: ధనిక వర్గాలకు కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాక్

కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితుడయినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బట్టి పరిశ్రమల వర్గాలు తెగ ఉబ్బిపోయాయి. ఆర్.బి.ఐ పరపతి విధానం ద్వారా తమ పరపతి ఇక ఆకాశంలో విహరించడమే తరువాయి అన్నట్లుగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తీరా చర్యల విషయానికి వచ్చేసరికి బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచేసరికి వాళ్ళకు గట్టి షాకే తగిలింది. ఆ షాక్ ఎంత తీవ్రంగా ఉందంటే ద్రవ్య విధాన సమీక్ష ప్రకటించాక భారత స్టాక్ మార్కెట్లు…

ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం

వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుండి భారీగా 0.8 శాతం తగ్గించుకుని 6.5 శాతం నమోదయితే చాలని చెప్పింది. ఎస్.ఎల్.ఆర్ లో మాత్రం కొంత సడలింపు ప్రకటించింది.…

ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గింపు, గృహ ఆటో కార్పొరేట్ రుణాలు చౌక

భారత రిజర్వ్ బ్యాంకు తన స్వల్ప కాలిక వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తూ ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల ప్రధానంగా కార్పొరేటు కంపెనీలు లబ్ది పొందుతాయి. నూతన పెట్టుబడుల కోసం, కంపెనీలు వ్యాపారాల విస్తరణ కోసం బ్యాంకులు మరిన్ని రుణాలను సమకూరుస్తాయి. తద్వారా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేయాలన్నది ఆర్.బి.ఐ లక్ష్యం. గృహ రుణాలపై కూడా వడ్డీ…