బాలి సదస్సు: పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగిన ఇండియా

(బాలి సదస్సు గురించి రాసిన ఆర్టికల్ పై మరింత వివరించాలని ఉమేష్ పాటిల్ అనే పాఠకులు కోరారు. ఆ కోరికను కూడా ఈ ఆర్టికల్ నెరవేర్చగలదు. ) దోహా రౌండ్ చర్చలను పునఃప్రారంభించే రందిలో ఉన్న భారత ప్రభుత్వం ‘గేమ్ ఛేంజర్’ గా చెప్పుకుంటున్న ఆహార భద్రతా చట్టానికి తానే తూట్లు పొడిచేవైపుగా వ్యవహరించింది. ఇండోనేషియా నగరం బాలిలో ఈ నెలలో  ‘దోహా రౌండ్’ చర్చలు పునః ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాల భారీ వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలన్న డిమాండ్…

డబ్లూ.టి.ఓ రాతినేలపై ఇండియా నాగలి సాగు -కార్టూన్

ప్రపంచ వాణిజ్య సంస్ధ (World Trade Organization)! ప్రపంచ దేశాలను చుట్టుముట్టి మెడపై కత్తి పెట్టినట్లు ‘ఆమోదిస్తారా, చస్తారా’ అంటూ ఆమోదించబడిన తొంభైల నాటి డంకేల్ ముసాయిదా, గాట్ (General Agreement on Trade and Tariff) ఒప్పందంగానూ అనంతరం డబ్ల్యూ.టి.ఓ గానూ మన ముందు నిలిచింది. స్ధాపించింది మొదలు పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా సమస్త రంగాలను ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ అనే చురకత్తులకు బలి చేస్తున్న సంస్ధ డబ్ల్యూ.టి.ఓ. ఇప్పుడిది…

బ్రిక్స్ గా మారిన బ్రిక్ కూటమి, జి-7 తో పోటీకి ఉరకలు?

నాలుగు దేశాలు బ్రిక్ కూటమి ఐదు దేశాల బ్రిక్స్ కూటమిగా మార్పు చెందింది. సౌతాఫ్రికా నూతనంగా ఈ కూటమిలో చేరడంతో BRIC కూటమి కాస్తా BRICS కూటమిగా మారింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా లు కలిసి బ్రిక్ కూటమి ఏర్పడింది. ఇప్పటివరకూ ఇది రెండు సమావేశాలను జరుపుకుంది. మూడో సమావేశం సౌతాఫ్రికా తో కలిసి చైనా లోని సాన్యాలో జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలుగా పేరు పొందిన దేశాలు కలిసి ఏర్పాటయిన…