పశ్చిమ అదుపులో ఉక్రెయిన్ హంతకదళాలు -రష్యా

సైన్యం పేరుతో తూర్పు ఉక్రెయిన్ లో నరమేధం సాగిస్తున్న ఉక్రెయిన్ హంతకదళాలు పశ్చిమ దేశాల అదుపులో ఉన్నాయి తప్ప ఉక్రెయిన్ ప్రభుత్వం అదుపులో కాదని రష్యా విదేశీ మంత్రి తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ ప్రజలకు ఆహారం, నీరు తదితర సహాయం అందజేయడానికి వీలుగా జర్మనీలో చర్చలు జరుపుతున్న విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ఈ సంగతి పత్రికలకు తెలిపారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రికి ఈ దళాలు హెచ్చరిక జారీ చేయడం బట్టి ఇది రుజువవుతోందని ఆయన తెలిపారు.…

పొరబాటున కూల్చారు -అమెరికా

అమెరికా ఇప్పుడు స్వరం మార్చింది. రష్యా ఇంటలిజెన్స్ అధికారుల ప్రత్యక్ష సహకారంతో తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే బక్ మిసైల్ తో మలేషియా విమానాన్ని కూల్చారని, అందుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ ఆరోపణల నుండి వెనక్కి తగ్గింది. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పొరబాటున కూల్చి ఉండవచ్చని చెబుతోంది. అయితే అందుకు కూడా తమ వద్ద సాక్ష్యాలు లేవని మెల్లగా చెబుతోంది. ఈ వ్యవహారం చూస్తే మహా భారతంలోని…

మలేషియా విమానం: ఎవరు కూల్చారు?

ఉక్రెయిన్ లో కూలిపోయిన విమానం దానికదే కూలిపోలేదని, ఎవరో కూల్చివేశారని పత్రికలన్నీ చెబుతున్నాయి. రష్యా తయారీ అయిన బక్ మిసైల్ తో విమానాన్ని కూల్చివేశారని, ఇది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అనీ ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది. తిరుగుబాటుదారులు మాత్రం అది తమ పని కాదని తమ వద్ద ఆ స్ధాయి మిలట్రీ పరికరాలు లేవని చెబుతున్నారు. భుజం మీద పెట్టుకుని ప్రయోగించే మిసైళ్ళు మాత్రమే తమ వద్ద ఉన్నాయని వాటితోనే ఉక్రెయిన్ ఫైటర్ జెట్ లను…

ఉక్రెయిన్: మరో 2 ప్రాంతాలు స్వయం పాలనకు నిర్ణయం

ఉక్రెయిన్ సంక్షోభం కొండవీటి చాంతాడు లాగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో రెండు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు స్వయం పాలన ప్రకటించుకున్నాయి. తాము నిర్వహించిన రిఫరెండంలో ఉక్రెయిన్ నుండి విడిపోయి స్వతంత్రంగా ఉండడానికే ప్రజలు నిర్ణయించారని దోనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల తిరుగుబాటు నేతలు ప్రకటించారు. రిఫరెండంను రష్యా కుట్రగా ఉక్రెయిన్ పాలకులు తిట్టి పోశారు. రిఫరెండంను వాయిదా వేయాలని రష్యా అధ్యక్షుడు కోరినప్పటికీ దానికి తిరుగుబాటుదారులు అంగీకరించలేదు. రిఫరెండం ఫలితాల నేపధ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు…

ఉక్రెయిన్ లో మళ్ళీ రష్యా పై చేయి?

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర మలుపుల దారిలో ప్రయాణించడం ఇంకా ఆగిపోలేదు. ఇ.యులో ఉక్రెయిన్ చేరికను వాయిదా వేసిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనలతో కూల్చివేయడం ద్వారా ఇ.యు, అమెరికాలో అక్కడ తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాయి. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి రష్యా అనుకూల ఆందోళనలు నిర్వహిస్తుండడంతో నూతన తాత్కాలిక ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతోంది. టెర్రరిస్టులపై దాడి పేరుతో క్రమాటోర్స్కి పైకి పంపిన ఉక్రెయిన్…

ఉక్రెయిన్ నుండి స్వతంత్రం ప్రకటించుకున్న దోనెట్స్క్

ఉక్రెయిన్ సంక్షోభం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఉక్రెయిన్ కేంద్ర ప్రభుత్వంలో తమ అనుకూలురను ప్రతిష్టించడం ద్వారా కుంభస్తలాన్ని కొట్టామని అమెరికా, ఐరోపాలు సంతోషపడుతుండవచ్చు. కానీ రష్యా పెద్దగా ఆర్భాటం లేకుండా, ఖర్చు లేకుండా తనపని తాను చేసుకుపోతోంది. ఒక్క గుండు కూడా పేల్చకుండా క్రిమియా ప్రజలే తమ ప్రాంతాన్ని రష్యాలో కలిపేలా పావులు కదిపింది, ఇప్పుడు ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోని తూర్పు రాష్ట్రం దోనెట్స్క్ ప్రజలు కూడా తమ రాష్ట్రాన్ని ఉక్రెయిన్ నుండి విడివడిన స్వతంత్రం దేశంగా…

రష్యా అనుకూల ఆక్రమణలో తూర్పు ఉక్రెయిన్

పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ప్రజా ప్రభుత్వాన్ని కుట్ర చేసి కూల్చివేసిన నేపధ్యంలో ఉక్రెయిన్ రష్యా, పశ్చిమ రాజ్యాల ప్రభావాల మధ్య నిలువునా చీలుతున్న భయాలు తలెత్తాయి. రష్యా అనుకూల ప్రజలు ఎక్కువగా నివసించే తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలో పలు పట్టణాలలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని రష్యా జెండాలను ఎగురవేస్తున్నారు. కొన్ని చోట్ల తమ ప్రాంత భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ‘ప్రజాభిప్రాయ సేకరణ’ జరపాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తుండగా ఉక్రెయిన్…