కొత్త నోట్లు: సెక్యూరిటీ నాణ్యత రెండు లేవు, అన్ని అబద్ధాలే!
పాత, పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఏమిటి? దేశంలో నల్ల ధనం పేరుకుపోయింది. ధనిక వర్గాలు, మనీ లాండర్లు, హవాలా రాకెటీర్లు, సమాంతర ఆర్ధిక వ్యవస్ధని నడుపుతున్నారు. సరిహద్దుల అవతలి నుండి దొంగ నోట్లు ముద్రించి దేశంలోకి వదులుతున్నారు. ఫలితంగా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం కలుగుతోంది. పేదలు ఎక్కువగా నష్టపోతున్నారు. సమానత్వం సాధించలేకపోతున్నాము. నల్ల డబ్బు జీడీపీ వృద్ధి రేటు పెంచుకోవటానికి ప్రధాన ఆటంకం అయింది. ఇక…