కన్హైయాపై సాక్షాలు లేవుట!

“JNUSU అధ్యక్షుడు కన్హైయా కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మేము వ్యతిరేకించం” అంటూ నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎంతో ఔదార్యంతో ప్రకటించారు. ఎందుకని అడిగితే “వెల్ ఒక యువకుడి జీవితం” అని జవాబిచ్చారాయన. విద్యార్ధులను అరెస్టు చేసి కేసు పెట్టడంలోనూ, విలేఖరులను, విద్యార్ధులనూ చావబాదుతున్న వీడియోలు ఉన్నా హిందూత్వ గూండాలను వెనకేసుకు రావడంలోనూ ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి హఠాత్తుగా కన్హైయా యువ విద్యార్ధి అన్న సంగతి ఎందుకు గుర్తుకు…

లగడపాటి తెలంగాణని వ్యతిరేకిస్తున్నది ఆస్తుల కోసం కాదట!

తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ‘సీమాంధ్రులు కూడా’ కూడా కాదు, దేశ ప్రజలంతా తెలుసుకోవలసిన విలువైన విషయం బెజవాడ ఎం.పి, లాంకో యజమాని, లగడపాటి రాజగోపాల్ గారు బుధవారం తెలియజేశారు. “ఆస్తులు కాపాడుకోవడానికే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్టు కాదు. నేను తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నది నా ఆస్తులను కాపాడుకోవడానికి కాదు. దేశ సమగ్రతను కాపాడడం కోసం” అని సగర్వంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పని చేస్తున్న జవాన్ స్ధాయిలో…