పోలీసుల ముందే కొట్టారు -కన్హైయా

ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియని పరిస్ధితుల్లో వీడియోలు చూస్తే తప్ప నమ్మలేని పరిస్ధితి దాపురించింది. శాస్త్ర పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సుఖమయం చేయడం ఏమో గానీ కుట్రదారులకు మాత్రం అది బాగా ఉపకరిస్తోంది. నేరుగా వాదించి నెగ్గలేని హిందూత్వ సంస్ధలు వీడియో మార్ఫింగ్ లకు దిగడంతో చివరికి వీడియోలను సైతం పట్టి పట్టి చూడవలసి వస్తోంది. కన్హైయా కుమార్ ని ఎవరూ కొట్టలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ ఆర్భాటంగా…

కన్హైయాపై సాక్షాలు లేవుట!

“JNUSU అధ్యక్షుడు కన్హైయా కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మేము వ్యతిరేకించం” అంటూ నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎంతో ఔదార్యంతో ప్రకటించారు. ఎందుకని అడిగితే “వెల్ ఒక యువకుడి జీవితం” అని జవాబిచ్చారాయన. విద్యార్ధులను అరెస్టు చేసి కేసు పెట్టడంలోనూ, విలేఖరులను, విద్యార్ధులనూ చావబాదుతున్న వీడియోలు ఉన్నా హిందూత్వ గూండాలను వెనకేసుకు రావడంలోనూ ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి హఠాత్తుగా కన్హైయా యువ విద్యార్ధి అన్న సంగతి ఎందుకు గుర్తుకు…

vandemaataram

“వందే మాతరం” -చెరబండరాజు కవిత

(యు.పి లో ఒకే రోజు జరిగిన నాలుగు అత్యాచారాల విషయమై రాసిన పోస్టు కి రాజశేఖర రాజు గారు అద్భుతమైన స్పందన పోస్ట్ చేసారు. ప్రముఖ విప్లవ కవి ‘చెరబండ రాజు’ రాసిన కవితను సందర్భ శుద్దిగా ప్రస్తావించిన రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన వ్యాఖ్యని యధా విధిగా ఇస్తున్నాను. చెరబండరాజు కవితకి ఇప్పటికీ ఎంత ప్రాధాన్యం ఉన్నదో కవిత చదివితే ఇట్టే అర్ధం అవుతుంది. దేశ భక్తి పరులు నిజంగా ఆలోచించవలసిన అంశాలు ఈ…