మద్యపానం: కనీస వయసు తగ్గించిన బి.జె.పి ప్రభుత్వం

వ్యాపారాలు చేసుకోవడానికి బ్రహ్మాండమైన సానుకూల వాతావరణం ఏర్పరుస్తామని ఎన్నికలకు ముందు బి.జె.పి వాగ్దానం చేసింది. ఆ సంగతి చెప్పడానికే ప్రధాని నరేంద్ర మోడి దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. గతంలో ఏ ప్రధానీ తిరగనన్ని దేశాలు అతి తక్కువ కాలంలోనే పర్యటిస్తూ ఆయన కొత్త రికార్డుల్ని స్ధాపిస్తున్నారు కూడా. ఇలా వ్యాపారులకు సంపూర్ణ సహకారం ఇవ్వడంలో బి.జె.పి ఏలుబడిలోకి వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతు పాత్రను ఘనంగా పోషిస్తున్నాయి. ముంబై నగరపు ఉత్సాహకరమైన రాత్రి…

మహారాష్ట్ర: పులికి గంట కట్టిన బి.జె.పి -కార్టూన్

మహారాష్ట్ర ఎన్నికలు-ప్రభుత్వ ఏర్పాటు నాటకంలో చివరి అంకం పూర్తయింది. ఎన్నికలకు ముందు బి.జె.పి తో పొత్తును తెగతెంపులు చేసుకున్నది లగాయితు శివ సేన నేతలు, బి.జె.పి పై నిప్పులు చెరగని రోజంటూ లేదు. ఉత్తుత్తి పులి గాండ్రింపులు చేసి చేసి అలసిపోయిన శివసేన చివరికి పిల్లికంటే దిగజారి తమ ముందు ‘ఎలుక’గా అభివర్ణించిన బి.జె.పి చేతనే మెడలో గంట కట్టించుకుంది. మహారాష్ట్రలో ఎవరిది ఆధిపత్య హస్తం అన్నది నిర్ధారించుకోవడంలో పరస్పరం విభేదించుకున్న బి.జె.పి, శివసేనలు తమ విభేదం…

ఫడ్నవీస్: విశ్వాస పరీక్ష ఇంత సులువా? -కార్టూన్

కూటమి యుగం ప్రారంభం అయ్యాక రాష్ట్రాల శాసన సభల్లోనూ, లోక్ సభలోనూ విశ్వాస పరీక్ష నెగ్గడం రాజకీయ పార్టీలకు కత్తి మీద సాముగా మారిపోయింది. కూటమిలో ప్రతి చిన్న పార్టీ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, అలాగని వారిని వదులుకోలేక కూటమి నేత పార్టీలు నానా చావు చచ్చేవి. కానీ మహారాష్ట్రలో మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా సరే అతి సులభంగా విశ్వాస పరీక్ష నెగ్గి ముందు తరాలకు ఒక ఆదర్శాన్ని చూపింది. బహుశా ఫడ్నవీస్…

జనాన్ని వెర్రివాళ్ళని చేస్తూ మహారాష్ట్ర నాటకం పూర్తి

ఒక నాటకం పూర్తయింది. పత్రికలను, రాజకీయ విశ్లేషకులను, పరిశీలకులను, జనాన్ని చివరి నిమిషం వరకు ముని వేళ్ళ మీద నిలబెట్టిన సస్పెన్స్ ధ్రిల్లర్ చివరికి ఎటువంటి మలుపులు లేకుండానే చప్పగా ముగిసింది. రంగంలో ఉన్న పార్టీలన్నీ, చివరికి కాంగ్రెస్ తో సహా, చక్కగా సహకరించడంతో మొట్టమొదటి బి.జె.పి ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేకుండా విశ్వాస పరీక్ష పూర్తి చేసుకుంది. బి.జె.పి ప్రభుత్వం విశ్వాస పరీక్ష విషయంలో అసలు ఓటింగు కోరిన నాధుడే లేడు. కాంగ్రెస్, ఎన్.సి.పి, శివసేన,…

శివసేన ఉండగా మరియు లేకుండగా… -ది హిందు ఎడిట్

(మహారాష్ట్రలో కొనసా…….. గుతున్న బి.జె.పి-శివసేనల రాజకీయ స్నేహ క్రీడ యొక్క తెర ముందు, వెనకల భాగోతాన్ని అర్ధం చేసుకునేందుకు ఈ నాటి ది హిందు సంపాదకీయం ఉపయోగపడుతుంది. -విశేఖర్) **************** రెండడుగులు ముందుకి, ఒకడుగు వెనక్కి. ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీతో శివసేన సంబంధ బాంధవ్యాలు నెమ్మదిగా కొనసాగడం మాత్రమే కాదు, ఇరు పక్షాలకు బాధాకరంగానూ మారుతోంది. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేలా సేన ప్రముఖ్ ఉద్ధవ్ ధాకరేకు నచ్చజెప్పిన…