భళా అరుణ్ కె. సింగ్!

బ్రిటన్ కేంద్రంగా పని చేసే బహుళజాతి మీడియా కార్పొరేట్ సంస్ధ రాయిటర్స్ ఈ రోజు ఓ వార్తా కధనాన్ని ప్రచురించింది. మోడి పాలనలో ఇండియాను సందర్శించే అమెరికా అధికారుల పరిస్ధితి ఏమిటో విశ్లేషించడానికి ప్రయత్నించిన కధనం అది. భారత రాయబారి దేవయాని ఖోబ్రగాదేను అక్రమంగా అరెస్టు చేసి జైలుపాలు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో తేడా ఏమన్నా వచ్చిందా అని ఈ కధనం విశ్లేషించేందుకు ప్రయత్నించింది. దేవయాని ఖోబ్రగాదే వ్యవహారం గురించి మర్చిపోతే గనక…

దేవయాని: అమెరికా రాయబారి రాజీనామా

భారత దేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా చేశారు. ఆమె రాయబారిగా నియమితులై రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ఈ లోపే రాజీనామా చేయడానికి దేవయాని ఖోబ్రగదే వ్యవహారమే కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కలవడం ద్వారా ఏడేళ్ళ బాయ్ కాట్ కి లాంఛనంగా తెరదించిన నాన్సీ పావెల్ రాజీనామా కొంత కాలంగా అమెరికా విదేశాంగ శాఖ చర్చల్లో నలుగుతున్నదే అని తెలుస్తోంది. రాజీనామా అనంతరం నాన్సీ…

దేవయాని: అమెరికా ఆఫర్ తిరస్కరించిన ఇండియా

దేవయాని విషయంలో చివరి క్షణాల్లో అమెరికా ఇవ్వజూపిన ఒక ఆఫర్ ను భారత ప్రభుత్వం తిరస్కరించిన సంగతి వెల్లడి అయింది. దేవయానిపై మోపిన నేరారోపణల తీవ్రతను తగ్గించి నమోదు చేస్తామని, అందుకు సహకరించాలని అమెరికా అధికారులు కోరారు. అయితే తగ్గించిన ఆరోపణలు కూడా క్రిమినల్ ఆరోపణలే కావడంతో అందుకు భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలను పూర్తిగా రద్దు చేయడం తప్ప మరో పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని ఇండియా స్పష్టం చేయడంతో అమెరికా తాను అనుకున్న పని…

మరో ప్రతీకారం: అమెరికా రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం

దేవయాని దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించడంతో ఇండియా మరో ప్రతీకార చర్య ప్రకటించింది. దేవయాని ర్యాంకుకు సమానమైన అమెరికా రాయబార అధికారిని ఇండియా విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయంలో దేవయాని ప్రస్తుతం నియమితురాలయిన సంగతి తెలిసిందే. ఐరాసలో భారత తరపు అధికారిగా దేవయాని పూర్తిస్ధాయి రాయబార రక్షణకు అర్హురాలు. రెండు రోజుల క్రితమే (జనవరి 8) దేవయానికి ఈ హోదా ఇస్తూ అమెరికా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవయాని…

దేవయాని: ప్రాసిక్యూషన్ కే అమెరికా నిర్ణయం

దేవయాని కేసు విషయంలో తెరవెనుక చర్చలు విఫలం అయినట్లు కనిపిస్తోంది. ఇంటి పని మనిషికి వేతనం చెల్లింపులో మోసానికి పాల్పడ్డారని ఆరోపించిన అమెరికా, దేవయాని ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుందని తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. అరెస్టు అయ్యే సమయానికి దేవయాని ఐరాస తాత్కాలిక సలహాదారుగా పూర్తి స్ధాయి రాయబార రక్షణ కలిగి ఉన్నారని భారత ఐ.ఎఫ్.ఎస్ అధికారులు కనుగొన్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అసలు కేసు పెట్టడానికి తగిన పునాది లేదని దేవయాని…

కొత్త మలుపు: అరెస్టు నాటికి పూర్తి రక్షణకు దేవయాని అర్హురాలే

దేవయాని ఖోబ్రగదే అరెస్టు విషయం కొత్త మలుపు తిరిగింది. వియన్నా ఒప్పందం ప్రకారం కాన్సలార్ సిబ్బంది పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు కాదని కాబట్టి ఆమె అరెస్టు, తదనంతరం ఆమె పట్ల వ్యవహరించిన తీరు చట్టబద్ధమే అని అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని దేవయానిని న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత కార్యాలయానికి సలహాదారుగా నియమించింది. ఈ హోదాలో ఆమె పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు అన్న…

దేవయాని అరెస్టు: ఇండియా ఆగ్రహం, తగ్గని అమెరికా

న్యూయార్క్ లో భారత కాన్సల్ కార్యాలయంలోని డిప్యూటీ కాన్సల్ జనరల్ దేవయాని అరెస్టుపై ఇండియా తీవ్రంగా స్పందించింది. వియన్నా సదస్సు ఒప్పందాలను గౌరవించకుండా తమ రాయబారి పట్ల అనుచితంగా వ్యవహరించడం తమకు ససేమిరా ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇండియాలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ను పిలిపించుకుని వివరణ కోరారు. కాగా అమెరికా మాత్రం వెనక్కి తగ్గలేదు. దేవయాని…