“సెప్టెంబరు 11” కి పదేళ్ళు -కార్టూన్

న్యూయార్క్, అమెరికా, నగరంలోని ప్రపంచ వాణిజ్య సంస్ధకు చెందిన జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగి నేటితో (సెప్టెంబరు 10) పదేళ్ళు నిండాయి. దాడుల్లో మూడువేలకు పైగా చనిపోయారని అమెరికా తెలిపింది. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన అమెరికన్లకు పూర్తిగా సానుభూతి, సహకారం అందించే లోపే, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, అదే దుర్ఘటనను అడ్డు పెట్టుకుని దురాక్రమణ యుద్ధాలకి తెర లేపాడు. రుజువుకాని నేరాన్ని మోపి, రుజువు కానవసరం లేదన్నట్లుగా, ఘటనతో సంబంధం లేని రెండు దేశాలు,…

నాటో దళాలపై తిరగబడ్డ ఆఫ్ఘన్ సైనికుడు, దాడిలో ఇద్దరి మరణం

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ సేనలపైన వారు శిక్షణ ఇస్తున్నామని చెబుతున్న ఆఫ్ఘన్ సైనికులే తిరగబడడం కొనసాగుతోంది. నాటో బలగాలను ఠారెత్తిస్తున్న ఇలాంటి దాడులు 2011 సంవత్సరంలో అమెరికా బలగాలకు తీవ్రం నష్టం చేకూర్చాయి. ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా తదితర నాటో దేశాల సైనికులకు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం అని చెప్పుకుంటున్న ప్రాంతాల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం విశేషం. ఆఫ్ఘనిస్ధాన్ రాజధాని నగరమైన కాబూల్, పష్తూనేతరులు నివసించే ఉత్తర రాష్ట్రాలు మిలిటెన్సీ తక్కువగా ఉన్న ప్రాంతాలనీ, భద్రమైన ప్రాంతాలనీ నాటో…

ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణ: ఆందోళనలో అమెరికా సైనికాధిపతులు

అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన సైనిక ఉపసంహరణ అమెరికా సైనికాధికారులకు ఒక పట్టాన మింగుడుపడ్డం లేదు. ఉపసంహరించనున్న సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, ఉపసంహరణ విషయంలో తమ అధ్యక్షుడు మరీ దూకుడుగా ఉన్నాడనీ వాళ్ళు భావిస్తున్నారు. జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న అడ్మిరల్ మైఖేల్ ముల్లెన్, ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నత స్ధాయి కమాండర్ డేవిడ్ పెట్రాస్‌లు ఒబామా ప్రకటించిన సంఖ్య “దూకుడు”గా ఉందని వ్యాఖ్యానించినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక తెలిపింది. వీరిద్ధరూ ఉపసంహరణ అమెరికా ఉపకరిస్తుందా…

బ్రిటన్ కూడా ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తుందట!

అమెరికా సైనికులను 33,000 మందిని వచ్చే సంవత్సరం సెప్టెంబరు లోపల ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఉపసంహరిస్తానని ప్రకటించాక ఫ్రాన్సు, తాను కూడా తన సైనికులు కొద్దిమందిని ఉపసంహరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ కూడా అమెరికాను అనుసరిస్తానని ప్రకటిస్తోంది. కనీసం 500 మంది బ్రిటిష్ సైనికుల్ని వెనక్కి రప్పించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని కామెరూన్ పరిగణిస్తున్నట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ఈ మేటర్‌తో సంబంధం ఉన్న విశ్వసనీయమైన వ్యక్తి తెలిపిన సమాచారంగా ఆ పత్రిక…

ఐదు రోజుల వ్యవధిలో 32 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో సేనలు

లిబియా పౌరుల్ని చంపాడంటూ గడ్దాఫీపై  అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ద్వారా అరెస్టు వారెంటు జారీ చేయించిన అమెరికా తదితర పశ్చిమ దేశాల నాటో కూటమి ఆఫ్ఘనిస్ధాన్‌లో పౌరులను చంపడం నిరాకటంకంగా కొనసాగిస్తూనే ఉంది. గత బుధవారం 18 మందినీ పొట్టన బెట్టుకున్న అమెరికా సేనలు ఆదివారం 14 మందిని చంపేశాయి. ఆదివారం చనిపోయినవారిలో ఇద్దరు స్త్రీలు కాగా మిగిలినవారంతా పిల్లలే. చనిపోయినవారిలో 2 సం.ల పసిపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఇవి మానవతకి వ్యతిరేకంగా జరిగిన నేరం.…

రెండో రోజూ కొనసాగుతున్న తాలిబాన్ల కాందహార్ దాడి

కాందహార్‌లో తాలిబాన్ల దాడి రెండో రోజూ కొనసాగుతోంది.14 మంది తాలిబాన్లను చంపినట్లు ప్రభుత్వ బలగాలు చెబుతున్నాయి. చనిపోయిన తాలిబాన్లలో కొద్దిమంది పాకిస్తానీయులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.  దాడి ఒసామా హత్యకు ప్రతీకరంగా చెప్పడాన్ని తాలిబాన్లు తోసిపుచ్చారు. దాడీ ముందే వేసుకున్న పధకం ప్రకారం జరిగిందని తాలిబాన్ చెప్పినట్లుగా బిబిసి తెలిపీంది. ఇద్దరు భద్రతాధికారులు, ముగ్గురు పౌరులు, శనివారం తాలిబాన్లు ఆత్మాహుతి బాంబులు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో ప్రభుత్వ భవనాలపై దాడులు చేశారు. అప్పటినుండీ కాల్పులు కొనసాగుతున్నాయి. మే…

అమెరికా అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యాలు: జెస్సికా లించ్, పేట్ టిల్‌మేన్, లిండా నార్గ్రోవ్

ఒసామా బిన్ లాడెన్ హత్య విషయంలో పొంతనలేని కధనాలు చెబుతున్న అమెరికాకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. ఇరాక్‌పై దాడి చేయడానికి కారణంగా ఆ దేశంలో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయనీ, వాటి వలన అమెరికా భద్రతకు ముప్పు అనీ అబద్ధాలు చెప్పింది. దానితో పాటు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కీ, ఒసామా బిన్ లాడెన్‌కీ సంబంధాలున్నాయని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. కానీ లాడెన్‌ను చంపానని చెప్పిన తర్వాత అమెరికా అధ్యక్షుడు గానీ, అధికారులు గానీ…

ప్రపంచ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్ మృతి, పైశాచికానందంలో దురాక్రమణ గుంపు

ఒసామా బిన్ లాడెన్‌ను ఎట్టకేలకు దురాక్రమణదారులు చంపగలిగారు. రెండు అగ్ర రాజ్యాల దురాక్రమణలను ఎదిరించి పోరాడిన బిన్ లాడేన్ హీరోచిత మరణం పొందాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లపై విమానాలతో డీకొట్టి కూల్చడం వెనక బిన్ లాడేన్ పధకం ఉందని యుద్ధోన్మాదుల మానస పు(ప)త్రికలు చేసిన ప్రచారంతో రెండు మదపుటేనుగులతో కలబడిన లాడెన్ ప్రతిష్ట తాత్కాలికంగా మసకబారవచ్చు. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచంపై బడి దేశాల సంపదలనన్నింటినీ కొల్లగొట్టే దుష్టబుద్ధితో వెంపర్లాడే అమెరికా నాయకత్వంలోని…

దురాక్రమణ సేనలపై వేసవి దాడులు మొదలుపెడతాం -తాలిబాన్

ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిన అమెరికా, తదితర పశ్చిమ దేశాల దురాక్రమణ సేనలపై ఆదివారం నుండి తాజా దాడులు ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రకటించింది. దురాక్రమణ సేనలు, వారి గూఢచారులు, దురాక్రమణ దేశాల తొత్తు ప్రభుత్వ అధికారులు, వారి సైనికులపై దాడులు చేస్తామని తాలిబాన్ ప్రకటించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ జోడు టవర్లను విమానాలతో కూల్చింది ఆల్-ఖైదా మిలిటెంట్లేనని నిశ్చయించుకున్న అమెరికా ఆల్-ఖైదాని అంతమొందించే పేరుతో ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణదాడి చేసిన సంగతి విదితమే. ఆల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్…