మిస్రాటా శరణార్ధి నౌకలు, పశ్చిమ దేశాల అబద్ధపు ప్రచారానికి సాక్ష్యం

లిబియా యుద్ధం ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్పే సమాధానం “గడ్డాఫీ సైన్యాలు లిబియా పౌరులపై దాడులు చేస్తూ చంపడం వలన” అని. అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమాలు చెలరేగుతున్నాయనీ, దానిలో భాగంగానే లిబియాలొ కూడా ప్రజాస్వామిక ఉద్యమం మొదలైందనీ, కానీ ఉద్యమాన్ని లిబియా నియంత గడ్డాఫీ సైనిక బలంతో అణచివేయడానికి లిబియా పౌరులను చంపుతుండడం వలన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నాయకత్వంలో కొన్ని దేశాలు లిబియా పై “నిషిద్ధ గగనతలం” అమలు చేయడానికి…

టెర్రరిస్టులకు ఐ.ఎస్.ఐ మద్దతునిస్తోంది -అమెరికా మిలట్రీ ఛీఫ్

ఆఫ్ఘనిస్ధాన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ రహస్యంగా మద్దతునిస్తోందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి “మైక్ ముల్లెన్” సంచలనాత్మక ఆరోపణ చేశాడు. మైక్ ముల్లెన్ పాకిస్తాన్ మిలట్రీ అధికారులతో చర్చల నిమిత్తం ఇస్లామాబాద్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ మిలిటెంట్ల నాయకుడు జలాలుద్దీన్ హఖానీ నడుపుతున్న సంస్ధతో ఐ.ఎస్.ఐకి దీర్ఘకాలింగా గట్టి సంబంధాలు ఉన్నాయనీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను చంపడంలో ఈ సంస్ధ నిమగ్నమై ఉందనీ ఆరోపించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో టెర్రరిస్టు సంస్ధలుగా అమెరికా పరిగణించే సంస్ధలను…

ఇరాక్ తరహాలో లిబియా దురాక్రమణకు ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు ల త్రయం తమ ఉద్దేశాలను మెల్ల మెల్లగా బైట పెట్టుకుంటున్నాయి. లిబియా తిరుగుబాటుదారులకు మిలట్రి సలదారులను పంపించడానికి బ్రిటన్ నిర్ణయించింది. గడ్డాఫీకి ఆయుధాలు అందకుండా చేయడానికి మొదట ‘అయుధ సరఫరా’ పై నిషేధం విధించారు. ఆర్ధిక వనరులు అందకుండా లిబియా ప్రభుత్వానికి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింప జేశారు. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా ప్రజలను రక్షించచే పేరుతో “నో-ఫ్లై జోన్” అన్నారు. ఆ పేరుతో లిబియా తీర ప్రాంతాన్ని విమానవాహక నౌకలతో…

సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్, ఆల్-ఖైదా లపై యుద్ధానికి పాకిస్తాన్ పైనే పూర్తిగా ఆధారపడ్డ అమెరికా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు ఆగ్రహంతో ఉన్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడిచే డ్రోన్ విమానాల దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడమే అమెరికా`ప్రభుత్వ అసలు ఉద్దేశమని కూడా…