మహారాష్ట్ర: దివాలి బాంబు, రెండు వత్తులు -కార్టూన్

అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించిన ఒక కోణాన్ని ఈ కార్టూన్ అద్దం పడుతోంది. ఎన్నికల ప్రచారంలో బి.జె.పిపై దాడి చేసేందుకు ఏ ఒక్క రాయినీ వృధా పోనీయని శివ సేన, ఎన్నికల అనంతరం ఆ పార్టీతోనే జట్టు కట్టి అధికారం పంచుకునేందుకు ఆత్రపడుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం చూపుతూనే ప్రభుత్వంలో చేరేందుకు తహతహలాడుతోంది. ఇక ఎన్.సి.పి సంగతి సరే సరి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే బి.జె.పి కి సైగలు…

విభిన్న చరిత్ర, సంస్కృతులను గుర్తుకుతెచ్చే దీపావళి -ఫోటోలు

చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి జరుపుకుంటున్నామని హిందూ పండితులు చెబుతారు. నరకాసుర వధకు గుర్తుగా ఆనందంగా జరుపుకునేది దీపావళి పండగ అని కొందరు చెబితే రావణుడిని జయించి రాముడు అయోధ్యకు చేరిన సందర్భంగా జరుపుకునే పండగ దీపావళి అని మరి కొందరు చెబుతున్నారు. సిరులు కురిపించమని కోరుతూ దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మిని కొలిచే సంప్రదాయం కూడా దేశంలో అనేకచోట్ల ఉన్నది. బంది చోర్ దివస్ పేరుతో సిక్కు మతస్ధులు దీపావళి రోజునే స్వర్ణ దేవాలయాన్ని…