గేట్ల వద్ద వద్ద అసలు శత్రువు -ది హిందు ఎడిట్ (ఫోటోలు)

(ఆదివారం నాడు ఇండియా-పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద అవతలివైపు భారీ పేలుడు సంభవించింది. అమాయక పౌరులు అనేకమంది ఈ ఆత్మాహుతి బాంబు పేలుడులో మరణించారు. ఈ అంశంపై మంగళవారం, నవంబర్ 4 2014, ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ***************** పాకిస్తాన్ లో వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి దుఃఖభాజనం. శోచనీయం ఏమిటంటే ఇది (సరిహద్దు) ద్వారాల వద్ద అసలు శత్రువు ఇండియా…

(విజిల్ బ్లోయర్) పేరు వెల్లడి వల్ల ప్రమాదాలు -ది హిందు ఎడిటోరియల్

(ఒకపక్క 2జి, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీం కోర్టు కేంద్రీకరించి పని చేస్తుంటే మరో పక్క ఆ కేసుల్లోని నిందితులు తరచుగా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటిని సందర్శిస్తున్న సంగతిని ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ సంస్ధ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. భారీ కుంభకోణాల లోని నిందితులతో దేశంలోని అత్యున్నత విచారణ సంస్ధ అధిపతే చెట్టాపట్టాలు వేసుకుంటే విచారణలో పాల్గొంటున్న అధికారులపై ప్రతికూల ఒత్తిడి ఉంటుందని కనుక రంజిత్ సిన్హాను సి.బి.ఐ డైరెక్టర్…

ఇండియా-అమెరికా సంబంధాల్లో షాడో బాక్సింగ్ -ది హిందూ ఎడిటోరియల్

(ఈ సంపాదకీయం ది హిందూ పత్రిక ఎప్పటి అవగానలో భాగంగా కనిపించడం లేదు. మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ బి.జె.పి నూతన హయాంలో సానుకూల అంశాలను కనిపెట్టడానికి ఆపసోపాలు పడుతున్నట్లు కనిపిస్తున్న ది హిందూ ధోరణిలోనే ఈ సంపాదకీయం సాగింది. లేదంటే తెలిసి తెలిసీ అమెరికాతో సత్సంబంధాలను కోరే దుస్సాహసానికి పత్రిక ఎందుకు పూనుకుందో అంతుబట్టని విషయం. కోరి దృత రాష్ట్ర కౌగిలిలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తున్న ఇటువంటి సంపాదకీయం ది హిందూ నుండి వెలువడడం ఒకింత ఆశ్చర్యకరమే…

నిర్బంధానికి ఆహ్వానం (ఛత్తీస్ ఘర్ మావోయిస్టుల దాడి పై ‘ది హిందు’ సంపాదకీయం)

ఛత్తీస్ ఘర్ లో కాంగ్రెస్ పార్టీ కాన్వాయ్ పై మెరుపు దాడి చేసి సీనియర్ నాయకులు మహేంద్ర కర్మ, నంద కుమార్ పటేల్ లతో సహా 24 మందిని దారుణంగా చంపడం ద్వారా మావోయిస్టులు ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలు ఎదుర్కోనున్న విపరిణామాలతో సంబంధం లేకుండా బస్తర్ లో ఘర్షణను విస్తరించడానికి తమ సంసిద్ధతను చాటుకున్నారు. 2005లో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతుతో స్ధానిక పోలీసులు ప్రారంభించిన హింసాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ‘సల్వా జుడుం’ ఉద్యమానికి బహిరంగ…

ఈ హిందు కార్టూన్ కి అర్ధం? -కార్టూన్

ఈ కార్టూన్ కి అర్ధం ఏమై ఉండొచ్చు? ‘ది హిందు’ పత్రికలో ప్రచురించబడిన కార్టూన్ లను వివరించడం ద్వారా వివిధ రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులను పాఠకుల దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చాలాసార్లు ఒక వ్యాసం చెప్పలేని విషయం నాలుగైదు అర్ధవంతమైన గీతలతో కూడిన కార్టూన్ శక్తివంతంగా చెబుతుంది. అందువలన ఒక పాఠకుడి సలహా మేరకు ‘కార్టూన్లు’ అని ఒక ప్రత్యేక కేటగిరి మొదలు పెట్టి వివిధ కార్టూన్లు ప్రచురిస్తున్నాను. అయితే ఈ రోజు ది హిందు…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి

(ఈ ఆర్టికల్ గత సంవత్సరం మార్చి నెలలో ఇదే బ్లాగ్ లో ప్రచురించబడింది. బ్లాగ్ ప్రారంభంలో రాసినందున పెద్దగా పాఠకుల దృష్టికి రాలేదు. ప్రధాన మంత్రి పదవి కోసం నరేంద్ర మోడి చేస్తున్న ప్రయత్నాలకు ఇంటా బయటా వస్తున్న మద్దతు, పోటీల దృష్ట్యా దీనికి ప్రాధాన్యత కొనసాగుతోంది. అందువలన పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) 2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం…

‘ఆధునికత’ ముసుగులో మెట్రోల్లో కొనసాగుతున్న కుల, మత వివక్షలు -ది హిందూ

భారత దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజ్ఞానానికి రాజధానిగా భాసిల్లుతున్న బెంగుళూరు లో కుల, మతాల మూఢత్వం ‘ఆధునికత’ ముసుగులో పరిఢవిల్లుతోందని ‘ది హిందూ’ వెల్లడించింది. సామాజిక వ్యవస్ధల్లో మనుషుల మధ్య తీవ్ర వైరుధ్యాలకు కారణంగా నిలిచిన కుల, మతాలు కాల క్రమేణా బలహీనపడుతున్నాయన్న విశ్లేషణల్లో నిజం లేదని ‘ది హిందూ’ పత్రిక ప్రచురిస్తున్న పరిశోధనాత్మక కధనాల ద్వారా తెలుస్తోంది. భూస్వామ్య వ్యవస్ధ మూలాలయిన కులం, మత విద్వేషాలు ఆధునికతకు మారుపేరుగా భావించే మెట్రో నగరాల్లో బలహీనపడకపోగా యధాశక్తితో…

ఫుకుషిమా వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం -ది హిందూ

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద మరో వినాశకర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర స్ధాయిలో హెచ్చరిస్తున్నారు. హీరోషిమా అణు బాంబు కంటే 5,000 రెట్లు రేడియేషన్ వాతావారణంలోకీ విడుదలయ్యే ప్రపంచ స్ధాయి ప్రమాదం సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కోల్డ్ షట్ డౌన్’ పూర్తయిందని గత డిసెంబరు లో జపాన్ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్ధితి అది కాదని వారు వెల్లడించారు. కర్మాగారంలో ప్రమాద స్ధాయిని తగ్గించడం కంటే ప్రమాదాన్ని కప్పి పుచ్చుతూ, సేల్స్…

‘ది హిందూ’ చేతిలో ఇండియాకి సంబంధించిన ‘వికీ లీక్స్’ డాక్యుమెంట్లు

అమెరికా తరపున ప్రపంచవ్యాపితంగా నియమించబడిన రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూఢచర్యం నెరుపుతూ సంపాందించిన వివరాలను కేబుల్ ద్వారా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిస్తారు. 1960 నుండి 2010 ఫిబ్రవరి వరకూ అలా పంపిన కేబుల్స్ ‘వికీ లీక్స్’ సంస్ధకు అందిన విషయం తెలిసిందే. వికీ లీక్స్ సంస్ధ తనకు అందిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ ను 2010 నవంబరు నెలాఖరు నుండి తన వెబ్ సైట్ లో ప్రచురిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాకు…