అవినీతి మరియు కోర్టులు -ది హిందు ఎడిట్

(సెషన్స్ కోర్టు విధించిన శిక్షపై హై కోర్టుకు అప్పీలు చేసుకున్నందున హై కోర్టు విచారణ ముగిసేవరకు శిక్షను సస్పెండ్ చేయాలని, బెయిల్ ఇవ్వాలని చేసుకున్న జయలలిత విన్నపాన్ని కర్ణాటక హై కోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ది హిందు పత్రిక ఈ రోజు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హై కోర్టు నిరాకరించడం వెనుక దొడ్డ సందేశం ఏదన్నా ఉంటే అది ప్రజా…

తీవ్రమైన ది హిందు, డిజిపిల వివాదం

పాత బస్తీలోని ఒక బాబాను రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి రాసిన వార్తపై రేగిన రగడ తీవ్రరూపం దాల్చుతోంది. పాతబస్తీలో నివసించే ముస్లిం మత బాబా హబీబ్ ముస్తఫా ఇద్రాస్ బాబాను డిజిపి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి ది హిందు పత్రిక వార్త ప్రచురించగా ఈ వార్తను దురుద్దేశంతో ప్రచురించారని డిజిపి ఆరోపిస్తున్నారు. ఇతర పత్రికలన్నీ ఈ వార్తకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా లోపలి పేజీల్లో వేయగా ది హిందు…

గౌరవ మర్యాదలకు విఘాతం -ది హిందు సంపాదకీయం

(బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానంలో అమెరికన్ ఎన్.ఎస్.ఏ లీకర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నాడన్న అనుమానంతో అమెరికా పనుపున ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అనుమతి నిరాకరించి, ఆస్ట్రియాలో బలవంతంగా కిందకి దించిన ఉదంతం గురించి ది హిందు పత్రిక బుధవారం -జులై 10- రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం -విశేఖర్) “తన ఇష్టం లేకుండా ఒక పావుగా ఉండవలసిన అవసరం గానీ, అందుకు తగిన కారణం గానీ లాటిన్ అమెరికాకు లేదు,”…

ఎడ్వర్డ్ స్నోడెన్, అందుకో వందనం! -ది హిందూ సంపాదకీయం

ప్రతి చారిత్రక క్షణమూ కొద్ది మంది వ్యక్తులను పతాక శీర్షికల్లో ఉంచుతుంది. ప్రభుత్వము, అధికారాల దుర్వినియోగం.. అలాంటి వారి నుండే అసాధారణ సాహసకృత్యాలను ప్రేరేపించి వెలికి తీస్తాయి. ప్రభుత్వాల ఉద్దేశ్యపూర్వక దుష్ట కార్యాల పట్ల –తమ పౌరులకు అబద్ధాలు చెప్పడం కావచ్చు, వారి ప్రైవేటు వ్యవహారాల్లోకి చొరబడడం కావచ్చు లేదా స్వార్ధ ప్రయోజనాలతో కుమ్మక్కవ్వడం కావచ్చు– విజిల్ ఊదడం ద్వారా ఈ దృఢచిత్తులు ప్రజలకు మంచి జరగడం కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టేస్తారు. ఒక…

మన్మోహన్ ఫైలుకి పరిష్కారం లేదు -కార్టూన్

ది హిందు పత్రికలో కేశవ్ కార్టూన్లు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఒక్కోసారి కేశవ్ కవి కాబోయి కార్టూనిస్టు అయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కార్టూన్లకు కవిత్వానికి ఉన్నంత లోతు ఉంటుంది. ఆ లోతు ఒక్కోసారి చాలామందికి అందదు. (నాక్కూడా.) ఈ కార్టూన్ అందులో ఒకటిగా కనిపిస్తోంది. ‘మిస్టర్ క్లీన్’గా ఒకప్పుడు మన్ననలు అందుకున్న మన్మోహన్ సింగ్ ఇప్పుడు అవినీతి రాజుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మన్మోహన్ కి ఆపాదిస్తున్న అవినీతి ద్వారా ఆయన స్వయంగా లబ్ది పొందకపోవడమే…