దళిత స్కాలర్ మరణం -ది హిందు
[Death of a Dalit scholar శీర్షికన జనవరి 19 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] ********* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న దళిత విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య, ప్రతిభా సంపన్నులతో నిండినవన్న భ్రాంతిని కలుగజేయడంలో పేరెన్నిక గన్న భారతీయ ఉన్నత విద్యా సంస్ధలు భూస్వామ్య దురహంకార గుణాల చేత వేధింపులకు గురవుతున్నాయనడానికి మరో విషాదకర సాక్షం. (యూనివర్సిటీ) పాలకులు సస్పెండ్ చేసిన…