చక్రవర్తిగారి కొత్త జాతీయవాదం -ది హిందు

“The Emperor’s new nationalism” శీర్షికతో ఫిబ్రవరి 20 వ తేదీ ది హిందూ సంపాదకీయానికి యధాతధ అనువాదం. ********* హైదారాబాద్ నుండి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వరకూ, రోహిత్ వేముల మరణం నుండి కన్హైయా కుమార్ అరెస్టు వరకు పాలక భారతీయ జనతా పార్టీ తలపెట్టిన రాజకీయ ఎజెండాను స్పష్టంగా గుర్తించవచ్చు. మొదటి ఊపులో ఇది అత్యున్నత నాయకత్వం అంతా -యూనియన్ కేబినెట్ మంత్రులతో సహా- విద్యార్ధి నాయకులతో తగువు పెట్టుకోవడానికీ సంఘ్ విద్యార్ధి…

పునరావాసం కల్పించగల న్యాయం (తీర్పు)! -ది హిందు

[డిసెంబర్ 21, 2015 తేదీన ది హిందు “Justice that is rehabilitative” శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ******* పరిపక్వ సమాజం జనం పెడబొబ్బలకు లొంగి తన న్యాయ వ్యవస్ధకు ఆధారభూతమైన పటుతర న్యాయ సూత్రాలను, సామాజిక నియమాలను తలకిందులు చేయదు. ప్రత్యేక శిక్షణా గృహంలో 3 సంవత్సరాల పాటు గడపాలని విధించిన శిక్ష ముగిశాక డిసెంబర్ 2012 నాటి ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులోని బాల నేరస్ధుడిని విడుదల చేసిన విషయంలో పెల్లుబుకిన…

వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్] *********** ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు.…

లౌకికవాదం మరియు రాజ్యాంగం -ది హిందు ఎడిట్..

[‘Secularism and the Constitution’ శీర్షికన నవంబర్ 30 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] ************ దేశంలో సహనం లేదా సహన రాహిత్యంపై  ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయమై ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాలు (తమదంటూ) ఓ స్పష్టతను చేర్చాలని భావించబడుతోంది. కానీ ఈ అంశాన్ని చేపట్టక మునుపే బిజెపి నేతృత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం, రాజ్యాంగం ప్రబోధించిన విలువలను ఈ రోజు ఏ మేరకు అర్ధం చేసుకున్నారన్న అంశంపై చర్చ…

అనుసరణ లేని ఆరాధన -ది హిందు ఎడిటోరియల్

రాజకీయ శాస్త్రవేత్త, ఆర్ధికవేత్త, న్యాయ నిపుణులు, సామాజిక సంస్కరణవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత, ఓ పురుష నేత (a leader of men): డా. బి.ఆర్.అంబేద్కర్  వైవిధ్యభరిత ఆసక్తులతో, బహుళముఖ వ్యక్తిత్వంతో వర్గీకరణవాద మరియు విభజనవాద ప్రయత్నాలను ధిక్కరిస్తారు. అయితే పేద, బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించేందుకు ఒంటి చేతితో కృషి చేయడం ద్వారా ఆయన తన జీవితకాలంలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా, జీవితానంతర దశాబ్దాలలో జాతీయ ఆదర్శ ప్రతిమగా అవతరించారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తో అనంతర…

నిశ్శబ్దం ఒక ఎంపిక కాదు -ది హిందు ఎడిటోరియల్

అమెరికా అధ్యక్షుడు బారక్ బారక్ ఒబామా, ఇండియాలో కుంచించుకుపోతున్న మత సామరస్యం గురించి తొమ్మిది రోజుల వ్యవధిలో రెండుసార్లు వరుసగా ప్రకటనలు గుప్పించడంపై ఇండియాలో కాస్త తత్తరపాటును సృష్టించింది. మొదటి సారి జనవరి 27 తేదీన తన భారత సందర్శనను ముగిస్తూ మత ప్రాతిపదికన లోలోపల విభజనకు గురైన దేశాలు ఎన్నటికీ ప్రగతి సాధించలేవన్న అంశాన్ని ఒబామా నొక్కి చెప్పారు; రెండోసారి ఫిబ్రవరి 5 తేదీన మాట్లాడుతూ ఆయన భారత దేశం నుండి వెలువడుతున్న మత అసహనం…

ఇండియా-రష్యా సంబంధాలకు పరీక్షకాలం -ది హిందు ఎడిట్

(రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియా వచ్చి వెళ్లారు. 20 ఒప్పందాలను ఆయన కుదుర్చుకుని మరీ వెళ్లారు. ఈ ఒప్పందాలను అమెరికా విమర్శించింది. ఈ అంశం గురించి ఈ రోజు ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ ‘Testing times for India-Russia ties’ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ********* బిలియన్ల డాలర్ల విలువ కలిగిన 20 ఒప్పందాలపై ఒక్క రోజులో సంతం చేయడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత సందర్శన ఒక ఉత్పాదక సందర్శన…