ఎన్.ఎస్.ఎ గూఢచర్యం: 10 దిగ్భ్రాంతికర మార్గాలు -వీడియో

అమెరికా గూఢచార సంస్ధ ‘నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ’ ని అమెరికా, ఐరోపాల్లో ‘నో సచ్ ఏజన్సీ’ అని కూడా అంటారు. దానర్ధం అంత లో ప్రొఫైల్ లో ఉంటుందా సంస్ధ అని. ప్రపంచ వ్యాపితంగా అది సాగిస్తున్న విస్తారమైన గూఢచర్యం (స్నోడెన్ పుణ్యమాని) లోకానికి తెలిసాక ఎన్.ఎస్.ఎ అంత లో ప్రొఫైల్ లో ఎందుకు ఉంటుందో జనానికి తెలిసి వచ్చింది. ఎన్.ఎస్.ఎ గూఢచర్యంలోని దిగ్భ్రాంతికరమైన 10 పద్ధతులను ఈ వీడియో వివరిస్తోంది. ఈ వీడియో ప్రధానంగా గూగుల్…

ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్…

పన్నులు ఎగవేయడానికి పౌరసత్వం త్యజించనున్న ఫ్రాన్సు సంపన్నుడు!

బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఫ్రాన్సులో అత్యంత సంపన్నుడు. 41 బిలియన్ యూరోల (52.33 బిలియన్ డాలర్లు, 2.9 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తులతో ప్రపంచంలోనే నాలుగో స్ధానంలో ఉన్న కుబేరుడు. ఈయనకి అర్జెంటుగా ఓ సమస్య వచ్చి పడింది. ఫ్రాన్సు నూతన అధ్యక్షుడు హాలండే, సూపర్ ధనవంతుల ఆదాయాలపైన 75 శాతం పన్ను వేయనున్నట్లు ప్రకటించడమే ఈయన సమస్య. అధ్యక్షుడు హాలండే, సంవత్సరానికి 1 మిలియన్ యూరోల కు మించి ఆదాయం పొందుతున్నవారిపై 75 శాతం పన్ను వేస్తానని…

ఫుకుషిమా: అణు పరిశ్రమతో బ్రిటన్ ప్రభుత్వం కుమ్మక్కు -ది గార్డియన్

జపాన్, ఫుకుషిమా అణు ప్రమాదాన్ని ప్రజలకు తక్కువ చేసి చూపడానికి బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు పరిశ్రమతో కుమ్మక్కయిందని ‘ది గార్డియన్’ పత్రిక వెల్లడి చేసింది. బ్రిటన్ లో మరో ఆరు కొత్త అణు విద్యుత్ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించినందున ఫుకుషిమా ప్రమాదం వల్ల తమ నిర్ణయాలకు ఆటంకం కలగవచ్చని భయపడింది. ఫుకుషిమా ప్రమాదం వాస్తవాలు వెల్లడయితే కొత్త కర్మాగారాల స్ధాపనకు ప్రతిఘటన పెరుగుతుంది గనక, దానికి వ్యతిరేకంగా అణు పరిశ్రమ వర్గాలతో కలిసి బ్రిటన్…