బ్రెజిల్ లో ప్రభుత్వ మార్పు -ది హిందు ఎడ్..

(Regime change in Brazil శీర్షికన మే 13 తేదీన వెలువడిన ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం.) ********* అది మరో పేరుతో జరిగిన తిరుగుబాటు కుట్ర. సెనేట్ అభిశంసన ఓటు ద్వారా అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ ను అధికార పదవి నుండి సస్పెండ్ చేయడం ద్వారా బ్రెజిల్ ప్రతిపక్షం అరుదైన విజయాన్ని సాధించింది. 55-22 ఓట్ల తేడాతో నెగ్గిన అభిశంసన 13 సం.ల వర్కర్స్ పార్టీ (పి‌టి) పాలనకు అంతం పలికింది. రౌసెఫ్ ఇప్పుడు…

రౌసెఫ్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

(బ్రెజిల్ వర్కర్స్ పార్టీ నేత దిల్మా రౌసెఫ్ రెండో సారి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. అనేక అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన నేపధ్యంలో ఆమెకు ప్రత్యర్ధుల నుండి గట్టి సవాలు ఎదురయింది. అయినప్పటికీ రనాఫ్ ఎన్నికల్లో కొద్ది తేడాతో గట్టెక్కారు. మొదటిసారి జరిగే ఎన్నికల్లో ఎవరికీ సాధారణ మెజారిటీ రాకపోతే, ముందు నిలిచిన ఇద్దరు అభ్యర్ధుల మధ్య రెండో సారి తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఇలా రెండో సారి జరిగే ఎన్నికలను రనాఫ్ ఎన్నికలు అంటారు. బ్రెజిల్ ఎన్నికల ఫలితంపై…

ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్…

టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…

కాళ్ళకూ, చెవులకూ ఎలక్ట్రిక్ షాక్ లు, బట్టలు ఊడడదీసి చేతులూ కాళ్ళూ కట్టేసి తలకిందులుగా వేలాడదీసి లాఠీలతో కుళ్లబోడవడం ఇవీ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నలభైయేళ్ల క్రితం ఎదుర్కొన్న చిత్రహింసలు. యుక్త వయస్సులో లెఫ్టిస్టు గెరిల్లా పోరాటంలో ఉండగా నియంతృత్వ ప్రభుత్వ పోలీసులకు పట్టుబడి మూడేళ్ళ చీకటి కారాగారవాసం అనుభవించిన దిల్మా రౌసెఫ్ తన గత జీవితాన్ని బహిరంగంగ ఇంతవరకూ ఏ పత్రికకూ, వ్యక్తులకూ చెప్పలేదు. ఎస్టెల్లా అనే యుద్ధ నామం (nom de guerre)…

ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్రెజిల్ పొదుపు ప్రయత్నాలు

  ద్రవ్యోల్బణం అదుపు, కోశాగార స్ధిరీకరణ (ఫిస్కల్ కన్సాలిడేషన్) పేరుతో ప్రజల సంక్షేమం కోసం పెట్టే ఖర్చులో కోతలు విధించడానికి బ్రెజిల్ ప్రభుత్వం కూడా సిద్ధపడినట్లు కనిపిస్టోంది. పెరిగి పోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటానికి 50 బిలియన్ల రియళ్ళ (రియల్ అనేది బ్రెజిల్ కరెన్సీ) మేరకు ఖర్చులు తగ్గిస్తామని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన పొదుపు మొత్తం  30 బిలియన్ డాలర్లకు సమానం.   ఆర్ధిక సంక్షోభం పుణ్యాన అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చైనా, బ్రెజిల్,…