ఈ దేశంలో బిచ్చగాళ్లూ ధనికులే -కార్టూన్

మేధావులు: ఈయన భోజనంలో రు. 15/- ల అన్నం, రు. 10/- ల పప్పు, రు. 5/0 ల ఉల్లి, రు. 5/- ల మసాలాలు ఉన్నాయి. కాబట్టి ఈయన దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్లే! *** ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ తాజాగా తన దరిద్ర ప్రమాణాల లెక్కలు విడుదల చేయడంతో దేశంలో పేదలు ఎంతమంది అన్న చర్చ మరోసారి రేగింది. సురేష్ టెండూల్కర్ లెక్క సరికాదని చెప్పిన రంగరాజన్ పట్టణ, గ్రామీణ దరిద్రం లెక్కని…

అయితే మేమూ దూరమవుతాం లెండి! -కార్టూన్

“అబ్బే, దాన్నేమీ సీరియాస్ గా తీసుకోనక్కర్లేదు. దాన్నుండి మేము దూరం జరుగుతున్నాంగా!” “ఇహిహి, అది కేవలం జోక్, అంతే. దాన్నుండి మేము దూరంగా జరుగుతున్నాం. సరేనా!” “మరేం పర్లేదు. మేమూ మీ నుండి దూరంగా జరుగుతున్నాం!” దేశంలో పేదల బతుకుల్ని అపహాస్యం చేస్తున్న పేదల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రుచి చూపుతోంది. దారిద్ర్య రేఖకు ప్రణాళికా శాఖ నిర్ణయించిన ప్రాతిపదిక అన్యాయంగా ఉన్నదని సుప్రీం కోర్టు సైతం మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తన కాకి లెక్కలనే మళ్ళీ ప్రకటించింది.…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -2

(మొదటి భాగం తరువాయి…) వేతనాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదా, వేతనాలు ఇవ్వడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ విషయం చూద్దాం. ప్రొఫెసర్ డాక్టర్. ఇందిరా హిర్వే, అహ్మదా బాద్ లోని ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్’ సంస్ధకు డైరెక్టర్ గా పని చేస్తోంది. సెప్టెంబర్ 27 న ‘ది హిందూ’ లో రాసిన ఆర్టికల్ లో గుజరాత్ అభివృద్ధి గురించి ఆమె చర్చించారు. గుజరాత్ లోని గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ రంగాల్లో పని చేస్తున్న…

కూలోడి కడుపుకి రు.28, ప్లానింగ్ ఆఫీసర్ టాయిలెట్ కి రు.35 లక్షలు

భారత దేశ పల్లెల్లో బతికే కూలోడికి రోజుకి రు. 28 చాలని చెప్పిన ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన కార్యాలయంలో ఆఫీసర్లు వాడే రెండు టాయిలెట్ల ఆధునీకరణ కోసం రు. 35 లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ టాయిలేట్ లో దొంగలు పడతారేమోనని సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టేనట. ఇది సక్సెస్ అయితే ప్లానింగ్ కమిషన్ కార్యాలయం ‘యోజన భవన్’ లో టాయిలెట్లన్నీ అలాగే…

రోజుకి రు.32/- లతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవు

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇటీవల సుప్రీం కోర్టుకి దారిద్ర్య రేఖ ప్రమాణాలపై సమర్పించిన అఫిడవిట్ ప్రకంపనలు సృష్టించడం కొనసాగుతోంది. సోనియా గాంధి నేతృత్వంలోని జాతీయ సలహా కమిటీ సభ్యుడు ఎన్.సి.సక్సేనా అహ్లూవాలియా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని లెక్కించడానికి విధించిన ప్రమాణంపై నిరసనపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. “రోజుకి 32 రూపాయల ఆదాయంతో కుక్కలు, జంతువులు మాత్రమే బతగ్గలవని ఆయన ‘మెయిల్ టుడే’ పత్రికతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. “మనిషనేవాడెవ్వడూ రోజుకు రు.32/-తో బతకడం అసాధ్యమని…

భారత ప్రజల్లో 40 కోట్లమంది దరిద్రులు, అదీ నెలకి వెయ్యి రూ.ల లెక్కన

భారత ప్రణాళికా సంఘం కొన్ని నిజాలను సుప్రీం కోర్టుకి తెలిపింది. భారత ప్రణాళిక సంఘం ఎవరిని దరిద్రులుగా లెక్కిస్తున్నదో కూడా వెల్లడించింది. ప్రణాళిక సంఘం దారిద్ర్య ప్రమాణాలను చూస్తే ముక్కు వేలు వేసుకోవలసిందే. మొత్తం 120 కోట్ల జనాభాలో 40.74 కోట్ల మంది దరిద్రంలో బతుకుతున్నారని ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకి తెలిపింది. ఎవరిని దరిద్రులుగా భావిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చూస్తే, పట్టణాలలో నెలకు రు.965/- (రోజుకి 32/-)కు తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులు కాగా, గ్రామాల్లో నెలకు…

ఎంత పేదరికం ఉంటే పేదలైనట్లు?

భారత దేశంలో పేదలుగా పరిగణింపబడడానికి ఎంత పేదరికం ఉండాలి? ఈ ప్రశ్నకి సాధారణంగా ఎవరైనా చెప్పే సమాధానం, ఉండటానికి ఇల్లు, కడుపునిండా తిండి, వైద్యం చేయించుకోగల స్తోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్టి లేని వారు పేదవారని. కాని మార్కెట్ ఎకానమీ మిత్రుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం దృష్టిలో భారత దేశంలోని పేదల లక్షణాలు అంతకంటే ఘోరంగా ఉండాలి. భారత దేశంలో ఇప్పటికీ అనేక మంది ఆకలి బారినపడి చనిపోతున్నారు. మలేరియా లాంటి…

ఇండియాలో దరిద్రుల సంఖ్య లెక్కింపుకు ప్రభుత్వ నిర్ణయం

భారత దేశంలోని 120 కోట్లమంది ప్రజల్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నవారు ఎంతమంది? ఈ ప్రశ్నకు అనేక జవాబులు ఉన్నాయి. ప్రభుత్వం 37 శాతం మంది దరిద్రులని చెబుతుంటే స్వతంత్ర అధ్యయనాల్లో ఒకటి 77 శాతం అని తెలిపింది. ఓ వ్యక్తి దరిద్రంలో ఉన్నాడు అని నిర్ధారించడానికి ఏర్పరిచిన ప్రాతిపదికల వలన ఇన్ని తేడాలు. ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి జీవనాధారాలు కల్పించి వారి పరిస్ధితులను మెరుగుపరచడం ద్వారా దరిద్రుల సంఖ్యని తగ్గించడానికి బదులు…