దళిత ఓటు: మోడి ‘అఖిల్లెస్ హీల్’ -కార్టూన్

మోడి రాజకీయాలు, దళిత ఓట్లు మధ్య నెలకొన్న సంబంధాన్ని వివరించడానికి, బహుశా, ఇదే గొప్ప పోలిక! ముందు అఖిల్లెస్ హీల్ అంటే ఏమిటో చూద్దాం. ఇది చాలా మందికి తెలిసి ఉండవచ్చు, ఐనా రికార్డు కోసం, తెలియని వాళ్ళ కోసం, వివరిస్తాను. గ్రీకు పురాణాల్లో అఖిల్లెస్ ఒక పాత్ర. మహాభారతంలో దుర్యోధనుడి తొడలతో అఖిల్లెస్ పాదాన్ని పోల్చవచ్చు. అఖిల్లెస్ పుట్టుక నాడు అతను యవ్వనంలోనే చనిపోతాడని జ్యోతిష్కులు చెబుతారు. ఆమె తల్లి ధేటీస్ అతన్ని శక్తివంతుడ్ని చేయాలని…

యూపి ఎన్నికలు : దళిత ఓట్లు  -కార్టూన్ 

2017లో  జరిగే  యూపి ఎన్నికలలో దళితుల ఓట్లు కీలకం అవనున్నాయని పార్టీలు భావిస్తున్నాయి. దానితో దళితులను ప్రసన్నం చేసుకుని లబ్ది పొందడానికి వివిధ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. బిజెపి మామూలుగానే దళిత వ్యతిరేక  పార్టీ . రోహిత్ ఆత్మహత్య  దరిమిలా ఆ ముద్రను థ్రువపరుచుకుంది. జెఎన్యూలో కొందరు బ్రాహ్మణ వాద ప్రొఫెసర్లు తయారుచేసిన డొజియర్ లో  “యూనివర్సిటీలో జాతీయ వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ దళితులు, ముస్లింలే” అని పేర్కొన్న నేపథ్యంలో…