గో రక్షణ క్రిమినల్ ముఠాలను శిక్షించరా?!

“అహో! మొదట ఈ గందరగోళమునందేల ప్రవేశించవలే?! ప్రవేశించితిపో…!” ********* ఇంతకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నోరు తెరవడం కూడా మహా భాగ్యమే అన్నమాట! దేశంలో చెలరేగుతున్న ఆందోళనలకు, మండుతున్న మంటలకు ప్రధాన మంత్రి స్పందన ‘ప్రధాని కూడా స్పందించారు’ అని చెప్పుకోవడానికా లేక ఆ స్పందన కార్యరూపం లోకి దాల్చుతుంది అని జనం నమ్మడానికా? “ప్రధాని స్పందించారు. ఇంకేం కావాలి? స్పందనపై గొడవ చేయడం ఎందుకు?” అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ప్రశ్నిస్తుంటే…

రోహిత్: చట్టం ఉల్లంఘన కాదు, అణచివేతకు ప్రతిఘటన!

“మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య” శీర్షిక గల ఆర్టికల్ కింద వ్యాఖ్యాతల అభిప్రాయాలకు సమాధానం ఈ టపా. ********* మీ ప్రశ్నల రీత్యా నేను చెప్పవలసినవీ, అడగవలసినవి కొన్ని ఉన్నాయి. విషయం మొత్తాన్ని ‘చట్టం పాటించడం లేదా అతిక్రమించడం’ లోకి మీరు కుదించివేశారు. ఆ పరిధి వరకే మీ దృష్టి ఉన్నట్లయితే అది మీ యిష్టం. కానీ ఈ అంశం కేవలం చట్టం అనుసరణ/ అతిక్రమణ వరకే పరిమితం అయిందని నేను భావించడం…

మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య!

రోహిత్ వేముల కులంపై చర్చ ఇంకా ముగియలేదు. పత్రికలు, ఛానెళ్లు, ప్రభుత్వాధికారులు, పోలీసులు ఈ సమస్యను ఇంకా కలియబెడుతూనే ఉన్నారు. రోహిత్ దళితుడా కాదా అన్నది అర్జెంటుగా తేల్చేయ్యాలన్నది కొందరి పంతంగా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే రోహిత్ దళితుడే అని నమ్ముతున్నవారికి ఎలాంటి సమస్యా లేదు. వారా చర్చలో నుండి ఎప్పుడో వెళ్ళిపోయారు. వారు రోహిత్ కు, అతనితో పాటు సస్పెండ్ అయినవారికి న్యాయం జరగాలన్న డిమాండ్ తో ఉద్యమంలో మునిగి ఉన్నారు. ఎటొచ్చీ రోహిత్ దళితుడు…

రోహిత్ వేముల దళితుడు కాదా?

యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో సస్పెన్షన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కులం గురించి ఈ నాలుగు రోజుల్లోనే అనేక కాకమ్మ కధలు ప్రచారంలో పెట్టారు. అనేక ఆడియోలు, వీడియోలు (డాక్టర్డ్) ప్రదర్శించారు. ఈ పుకార్లు, కధలు, వీడియోలు ప్రచారం చేసిపెట్టడంలో ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న వార్తా ఛానెళ్లు, ముఖ్యంగా ఆంగ్ల వార్తా ఛానెళ్లు తలమునకలుగా సహకరించాయి. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దళితుడు కావడం వల్లనే…

రోహిత్: దళిత విద్యార్ధులు Vs హిందూత్వ రాజ్యం!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆమె ఇచ్చిన వివరణ విద్యార్ధుల భావోద్వేగాలను చల్లార్చడానికి బదులు మరింత రెచ్చగొట్టినట్లుగానే వెలువడింది. “ఇది దళితులు-దళితేతరుల మధ్య సమస్యకు సంబంధించినది కాదు. రెండు విద్యార్ధి సంఘాలకు మధ్య ఘర్షణకు సంబంధించిన సమస్య. దళిత్ పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దు” అని ఆమె ప్రకటించారు. అదే నోటితో ఆమె “వైస్ ఛాన్సలర్ ఆదేశాలను (ఆర్డర్ ను) విద్యార్ధులకు స్వయంగా అందించిన వ్యక్తికూడా దళితుడే” అంటూ తాను కూడా దళితుడి భుజం…

యు.పి.ఏ ప్రభుత్వంలో దళితుల గురించి పట్టించుకునే నాధుడే లేడు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

  భారత దేశంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ ప్రభుత్వం నిమ్న వర్గాలకు చాలా చేస్తున్నట్లు గప్పాలు కొట్టుకొంటుంది. ‘పనికి ఆహార పధకం’, ‘ఉపాధి హామీ పధకం’, తాజాగా ‘ఆహార భద్రతా చట్టం’ ఇలా దేశంలోని పేదవారి కోసం పలు పధకాలు రూపొందించి వారిని పైపైకి లాగడానికి తీవ్రంగ శ్రమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమయం వచ్చినప్పుడల్లా డబ్బా కొట్టుకుంటుంది. ఒక్క యు.పి.ఏ అనే కాదు. దానికి ముందు పాలించిన ఎన్.డి.ఏ, దానికి ముందు యునటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ తదితర…