ఐదువేలు చెల్లించలేదని దళితుడి సజీవ దహనం

ఇది మరో ఘటన. దళితులపై కొనసాగుతున్న దుర్మార్గాలకి మరొక సాక్షీభూతం. తీసుకున్న అప్పు ఐదు వేలు చెల్లించలేదని అందరి ముందూ కిరోసిన్ పోసి తగలబెట్టిన ఈ దుర్మార్గం రెండు కుటుంబాలకు ‘మగ దిక్కు’ ని దూరం చేసింది. సజీవ దహనానికి ఐదు వేల అప్పు చెల్లించకపోవడం కారణం కాదనీ, అప్పు తీర్చమని వచ్చి పదే పదే కొడుతూ అవమానించినందుకు పోలీసులకు రిపోర్టు ఇవ్వడమేననీ బాధితుడి కుటుంబీకులు చెబుతున్న నిజం. ‘దిక్కు’ ని కోల్పోయిన ఈ కుటుంబీకుల దైన్యం…