ఆకలికి నకనకలాడుతున్నవారు 84 కోట్లు -ఐరాస

తీవ్ర ఆకలితో (chronic hunger) అలమటిస్తున్నవారు ప్రపంచంలో 84.2 కోట్లమందని ఐరాస ప్రకటించిన నివేదిక ఒకటి తెలిపింది. 2010-12 కాలంలో ఈ సంఖ్య 86.8 కోట్లని, 2011-13 కాలంలో అది 2.6 కోట్లు తగ్గిందని సదరు నివేదిక తెలిపింది. కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్రంగా ఆకలిగొన్నవారు 1.57 కోట్లమంది ఉండడం గమనార్హం. ‘ప్రపంచంలో ఆహార అబధ్రత పరిస్ధితి’ అన్న నివేదికలో ఐరాస ఈ అంశాలను తెలియజేసింది. ఐరాసలోని ఆహార విభాగం ఎఫ్.ఎ.ఓ (Food and Agricultural…

యువరాజా నాయకత్వ విలువ! -కార్టూన్

ఉల్లి, తదితర ఆహార సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయి? తరుగు ఉత్పత్తిని పసిగట్టిన వ్యాపారులు సదరు సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచి తద్వారా లబ్ది పొందాలని చూసినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఇది పై నుండి కింది వరకూ అందరికీ తెలిసిన నిజమే. ఈ సంగతి తెలిసి కూడా ధరల పెరుగుదల పైన ప్రధాని తదితర ఢిల్లీ నాయకుల నుండి ఛోటా మోటా గల్లీ నాయకుల వరకు ధరల పెరుగుదల పైన ఒకటే…

అయితే మేమూ దూరమవుతాం లెండి! -కార్టూన్

“అబ్బే, దాన్నేమీ సీరియాస్ గా తీసుకోనక్కర్లేదు. దాన్నుండి మేము దూరం జరుగుతున్నాంగా!” “ఇహిహి, అది కేవలం జోక్, అంతే. దాన్నుండి మేము దూరంగా జరుగుతున్నాం. సరేనా!” “మరేం పర్లేదు. మేమూ మీ నుండి దూరంగా జరుగుతున్నాం!” దేశంలో పేదల బతుకుల్ని అపహాస్యం చేస్తున్న పేదల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రుచి చూపుతోంది. దారిద్ర్య రేఖకు ప్రణాళికా శాఖ నిర్ణయించిన ప్రాతిపదిక అన్యాయంగా ఉన్నదని సుప్రీం కోర్టు సైతం మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తన కాకి లెక్కలనే మళ్ళీ ప్రకటించింది.…