మాయావతిపై ఎఫ్‌ఐఆర్: గాయాన్ని శిక్షించాలని కత్తి డిమాండ్!
అనుకున్నంతా అయింది! అఖ్లక్ ని చంపారు. అఖ్లక్ కొడుకుని మృత్యు ముఖం వరకూ తీసుకెళ్లారు. మళ్ళీ అఖ్లక్ నీ, ఆయన కుటుంబాన్నే దొషులుగా నిలబెట్టారు, హిందూత్వ కుట్రదారులు. మాయావతిని తిట్టారు. వేశ్య కంటే నీచంగా టికెట్లు అమ్ముకుంటుంది అన్నారు. ఇప్పుడు ఆమె పైన కూడా ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆమెనీ దోషిని చేసేశారు. బాధితులే నేరస్ధులన్న మాట! కత్తిది కాదు, గాయానిదే తప్పన్నమాట! కత్తి దిగబడేంత మెత్తగా ఎవరుండమన్నారు, గాయాన్ని? కత్తి దూసుకొస్తుంటే పక్కకు…