ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో వెల్లడయిన ప్రపంచ ఆర్ధికశక్తుల వైరుధ్యాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో మరింతగా కూరుకుపోతున్న నేపధ్యంలో ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. టోక్యోలో జరిగిన ఐ.ఎం.ఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకుల వార్షిక సంయుక్త సమావేశంలో ఈ విభేధాలు ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యాయి. ప్రపంచ కాబూలీ సంస్ధలయిన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల 2012 వార్షిక సమావేశాలు జపాన్ రాజధాని టోక్యో లో అక్టోబర్ 9 నుండి 14 వరకు జరిగాయి. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నిర్విఘ్నంగా నెరవేరడానికి సూత్రాలు,…

దక్షిణ చైనా సముద్రం ప్రపంచ ఆస్తి -ఎస్.ఎం.కృష్ణ

దక్షిణ చైనా సముద్రంలో భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఓ.ఎన్.జి.సి విదేశ్ సాగిస్తున్న ఆయిల్ వెతుకులాటపై చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికి చెందిన ఆస్తి అని దానిపై ఏ దేశానికి హక్కులు లేవనీ భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణం వ్యాఖ్యానించాడు. దేశాల జోక్యాన్నుండి దక్షిణ చైనా సముద్రంలో జోక్యం ఉండరాదని ఆయన ప్రకటించాడు. “దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికి చెందిన ఆస్తి అని భారత దేశం భావిస్తోంది.…

దక్షిణ చైనా సముద్రం జోలికి రావద్దు, అమెరికాకు చైనా పరోక్ష హెచ్చరిక

‘దక్షిణ చైనా సముద్రం’ విషయంలో గల వివాదాల్లో బైటి శక్తులు జొక్యం చేసుకోవడానికి వీల్లేదని చైనా శుక్రవారం హెచ్చరించింది. చైనా హెచ్చరిక అమెరికా ని ఉద్దేశించినదేనన్నది బహిరంగ రహస్యం. ఆసియా ప్రాంతాన్ని వదిలి పెట్టి వెళ్ళేది లేదని ఆష్ట్రేలియా పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా చైనాకు పరోక్షంగా సూచించిన అనంతరం చైనానుండి ఈ హెచ్చరిక రావడం గమనార్హం. ఆసియా శిఖరాగ్ర సభ జరాగనున్న సందర్భంగా అమెరికా, చైనా ల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది.…

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా ప్రాజెక్టు రాజకీయంగా రెచ్చగొట్టడమే -చైనా

చైనా ప్రభుత్వ ప్రతినిధి నుండి ఇండియాకు హెచ్చరిక అందిన మరుసటి రోజే మరొకసారి పరోక్షంగా హెచ్చరిక జారీ అయింది. ఈ సారి చైనా ప్రభుత్వం నడిపే “గ్లోబల్ టైమ్స్” పత్రిక, దక్షిణ చైనా సముద్రంలో ఇండియా కంపెనీలు ప్రాజెక్టులు చేపట్టడం అంటే చైనాను రాజకీయంగా రెచ్చగొట్టడమేనని పేర్కొన్నది. భారత కంపెనీ ఒ.ఎన్.జి.సి, దక్షిణ చైనా సముద్రంలో చమురు, సహజవాయువుల అన్వేషణ ప్రాజెక్టును చేపట్టకుండా సాధ్యమైన “అన్ని సాధనాలనూ’ వినియోగించాలని చైనా ప్రభుత్వాన్ని గ్లోబల్ టైమ్స్ పత్రిక కోరింది.…

అమెరికా సెనేట్‌లో విచిత్రం, వివాద పరిష్కారానికి చైనా బలప్రయోగంపై ఖండన తీర్మానం

అమెరికా సెనేట్‌లో సోమవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బహుశా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇది స్ధానం సంపాదించుకోవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల పరిష్కారానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదీ ఏకగ్రీవంగా. ఒక దేశానికి ‘బల ప్రయోగం చేయడం తగదు” అని సుద్దులు చెప్పే అర్హత అమెరికా తనకు తాను దఖలు పరుచుకోవడమే ఇక్కడ వింత. బల ప్రయోగం చేస్తే చైనాని నిస్సందేహంగా తప్పు పట్టవలసిందే.…