ద.చై.స: చైనాకు ట్రంప్ ప్రభుత్వం వార్నింగ్!

ఎన్నికల ముందు నుండీ చైనాపై కత్తులు దూస్తున్న డొనాల్డ్ ట్రంప్, అధ్యక్ష పదవి చేపట్టాక కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. దక్షిణ చైనా సముద్రాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే, తగిన ప్రతిఘటన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్య రవాణా మార్గంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రయోజనాలను కాపాడుకుని తీరతామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ షాన్ స్పైసర్ విలేఖరుల సమావేశంలో హెచ్చరించాడు. వైట్ హౌస్ పత్రికా ప్రతినిధి అమెరికా…

అమెరికా, జపాన్ లతో మిలట్రీ డ్రిల్ కు ద.కొరియా నో!

ఆసియాలో, ఖచ్చితంగా చెప్పాలంటే దక్షిణ చైనా సముద్ర తీరంలో ఒక విశేషం చోటు చేసుకుంది. ఆసియాలో జపాన్ తర్వాత దక్షిణ కొరియాయే అమెరికాకు నమ్మిన బంటు. అమెరికాకు చెందిన అది పెద్ద సైనిక స్ధావరాలు జపాన్, దక్షిణ కొరియాలలోనే ఉన్నాయి. అయితే ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని బెదిరించడానికి జపాన్, అమెరికాలు తలపెట్టిన సంయుక్త విన్యాసాలలో పాల్గొనడానికి దక్షిణ కొరియా నిరాకరించడమే ఆ విశేషం. ఉత్తర కొరియాకు చెందిన జలాంతర్గాములను లక్ష్యం చేసుకుని దక్షిణ కొరియాతో…

అమెరికా ఆయుధ కొనుగోళ్లు రద్దు -ఫిలిప్పైన్స్

  ఇటీవల అధికారం చేపట్టినప్పటి నుండి అమెరికాపైనా అధ్యక్షుడు ఒబామా పైనా బహిరంగానే విరుచుకుపడుతున్న ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టె తాజాగా మరో సారి విరుచుకు పడ్డాడు. ఇప్పటి వరకు దూషణలకు, సవాళ్లకు పరిమితమైన ఆయన ఇప్పుడు ఏకంగా చర్యల లోకి దిగినట్లు కనిపిస్తున్నది.  ఫిలిప్పైన్స్ పోలీసుల వినియోగం కోసం అమెరికా నుండి భారీ మొత్తంలో రైఫిల్స్ కొనటానికి గతంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన బెట్టి మరో దేశం నుండి రైఫిల్స్ కొనుగోలు చేస్తామని డ్యుటెర్టె…

నిప్పుతో చెలగాటం వద్దు! -జపాన్ తో చైనా

  దక్షిణ చైనా సముద్రంలో అమెరికాతో చేరి వెర్రి మొర్రి వేషాలు వేయొద్దని చైనా, జపాన్ ను మరోసారి హెచ్చరించింది. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరుతో అమెరికా నిర్వహిస్తున్న మిలట్రీ పెట్రోలింగ్ లకు దూరంగా ఉండాలని కోరింది. ఉమ్మడి విన్యాసాలని చెబుతూ వివాదాస్పద అమెరికా మిలట్రీ విన్యాసాల్లో పాల్గొనటం ద్వారా ప్రాంతీయంగా అస్ధిరతకు ప్రాణం పోయవద్దని కోరింది.  దక్షిణ చైనా సముద్రంలో జపాన్ కు ఎలాంటి పని లేదని, అది బైటి దేశమేనని, బైటి దేశాలు చైనా…

దచైస: సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలి -చైనా పత్రిక లు

అవసరం ఐతే దక్షిణ చైనా సముద్రం విషయంలో సాయుధ ఘర్షణకు సిద్ధంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్లోబల్ టైమ్స్ పిలుపు ఇచ్చింది. చైనా జాతీయ ప్రయోజనాలను నిక్కచ్చిగా ప్రతిబింబిస్తుందని, కఠినంగా వెల్లడిస్తుందని పేరున్న గ్లోబల్ టైమ్స్ తాజాగా ఇచ్చిన పిలుపుతో పశ్చిమ పత్రికలు, పరిశీలకులు అప్రమత్తం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో -బహుశా జులై 12 తేదీన- హేగ్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో ఫిలిప్పీన్స్ ఇచ్చిన…

కోర్టు ఆజ్ఞలు ఉల్లంఘిస్తే ఊరుకోం -చైనాతో అమెరికా

ఏదో ఒక వంక పెట్టుకుని కాలు దువ్వక పోతే అమెరికాకు రోజు గడవదు. చైనా లక్ష్యంగా తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాలలో భారీ మిలటరీ బలగాలను మోహరించిన అమెరికా అడపాదడపా చైనాకు వ్యతిరేకంగా యుద్ధ సవాళ్లు విసురుతోంది. త్వరలో వెలువడే అంతర్జాతీయ కోర్టు తీర్పును పాటించకుండా విస్మరిస్తే చైనా తగిన ఫలితం అనుభవించ వలసి ఉంటుందని అమెరికా తాజాగా బహిరంగ వివాదానికి అంకురార్పణ చేసింది. అంతర్జాతీయ కోర్టుగా పరిగణించబడే ‘పర్మినెంటు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ లో…

కోల్డ్ వార్ మనస్తత్వం వదలండి, అమెరికాతో చైనా

అమెరికా హెచ్చరికలకు చైనా ఘాటుగా బదులు ఇచ్చింది. రక్షణ కార్యదర్శి (మన రక్షణ మంత్రికి సమానం) ఎష్టన్ కార్టర్ చేసిన వ్యాఖ్యలు కోల్డ్ వార్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోల్డ్ వార్ మెంటాలిటీ నుండి బైటికి వస్తే మంచిదని హెచ్చరించింది. అమెరికా మిలట్రీ అధికారులు డైరెక్ట్ చేసే హాలీవుడ్ కోల్డ్ వార్ సినిమాలో తాము ఎలాంటి పాత్ర పోషించబోమని అపహాస్యం చేసింది. “కార్టర్ వ్యాఖ్యలు అమెరికా స్టీరియోటైప్ ఆలోచనా విధానాన్ని, అమెరికా ఆధిపత్య భావనని నగ్నంగా ఆరబోశాయి” అని…

అమెరికా విమానంపై చైనా ఫైటర్ జెట్ చెక్కర్లు

దక్షిణ చైనా సముద్రంపై గూఢచర్యం నిర్వహించడానికి వచ్చిన అమెరికన్ విమానం చుట్టూ చైనా మిలట్రీ ఫైటర్ జెట్ (ఎస్.యు-27) ప్రమాదకరంగా గిరికీలు కొట్టిందని అమెరికా ఆరోపించింది. కాస్త ఉంటే తమ విమానాన్ని చైనా ఫైటర్ జెట్ ఢీ కొట్టి ఉండేదేనని ఆందోళన ప్రకటించింది. చైనా మిలట్రీ చర్య ‘అభద్రతతో కూడినది, వ్యవహార విరుద్ధం’ అని అమెరికా మిలట్రీ అధికారులు నిరసించారు. ఆగస్టు 19 తేదీన ఈ ఘటన జరిగిందని పెంటగాన్ (అమెరికా మిలట్రీ హెడ్ క్వార్టర్స్) ప్రెస్…

షాంగ్రీ-లా డైలాగ్: చైనా, అమెరికా పరస్పర సవాళ్ళు!

సింగపూర్ లో శనివారం జరిగిన ‘షాంగ్రీ-లా డైలాగ్’ చైనా, అమెరికాల మధ్య మాటల తూటాలు పేలడానికి వేదికయింది. ప్రాంతీయంగా అస్ధిరత్వం నెలకొనడానికి చైనా కారణం అవుతోందని అమెరికా చైనాను నిందించగా, అమెరికా ప్రసంగం చైనాను బెదిరిస్తున్నట్లుగా ఉందని చైనా తిప్పి కొట్టింది. అమెరికా తరపున డిఫెన్స్ కార్యదర్శి చక్ హెగెల్ ప్రసంగించగా చైనా తరపున ఆ దేశ ఆర్మీ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ వాంగ్ గువాంగ్ ఝాంగ్ ప్రసంగించారు. ‘ఆసియన్ సెక్యూరిటీ ఫోరం’…

ఆచూకీ లేని విమానం, మోగుతున్న సెల్ ఫోన్లు -ఫోటోలు

అనూహ్య పరిస్ధితుల్లో అదృశ్యం అయిన మలేషియా విమానం కోసం సముద్రం జల్లెడ పడుతున్నా ఇంకా ఫలితం దక్కలేదు. మొత్తం 10 దేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆలవాలం అయిన దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జలాల హక్కులపై నెలకొన్న తగాదాలను పక్కనబెట్టి మరీ ఆయా దేశాలకు చెందిన మిలట్రీ విమానాలు, సివిల్ ఏవియేషన్ విభాగాలు, సముద్ర రక్షక బలగాలు, తీర రక్షక బలగాలు (కోస్ట్ గార్డ్)  గాలింపు జరుపుతున్నాయి.…

మలేషియా ప్రమాదం: అది విమాన ఇంధనం కాదు

మలేషియా విమాన ప్రమాదం మరింత మిస్టరీలోకి జారిపోయింది. దక్షిణ చైనా సముద్రంలో కనపడిన రెండు భారీ చమురు తెట్లు విమాన ఇంధనంకు సంబంధించినవి కావని పరీక్షల్లో తేలింది. వియత్నాం నావికా బలగాలకు కనపడ్డాయని చెబుతున్న విమాన శిధిలాలు కూడా వాస్తవానికి ఎక్కడా కనపడలేదని తెలుస్తోంది. దీనితో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చుట్టూ మరింత మిస్టరీ అల్లుకున్నట్లయింది. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ప్రయాణిస్తున్న ఇరువురు ప్రయాణీకులు మలేషియా దేశస్ధులు కారని, చైనా…

చైనాతో సమస్యలా? అదేం లేదే! -అమెరికా

దలైలామా, ఒబామాల సమావేశం దరిమిలా చైనా ప్రభుత్వం అమెరికా రాయబారికి ఓవైపు సమన్లు జారీ చేస్తుండగానే చైనాతో తమకు సమస్యలేమీ లేవని అమెరికా మిలట్రీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా అత్యున్నత మిలట్రీ అధికారి బీజింగ్ పర్యటిస్తూ చైనాతో సంబంధ బాంధవ్యాలు తమకు ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు. వద్దు వద్దని వారిస్తున్నా వినకుండా టిబెటన్ భౌద్ధ గురువు దలైలామాను అమెరికా అధ్యక్షుడు ఒబామా కలుసుకున్నందుకు చైనా తీవ్ర నిరసన తెలిపిన మరుసటి రోజే మిలట్రీ అధికారి శాంతి…

1.1 ల.టన్నుల వాహక నౌకతో అమెరికాకు చైనా సవాలు

చైనా తన మిలట్రీ సామర్ధ్యాన్ని వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో పెద్ద ఎత్తున మిలట్రీ బలగాలను మోహరించిన అమెరికాకు దీటుగా 1.1 లక్షల టన్నుల భారీ సూపర్ విమాన వాహక నౌక నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్ధ్యంతో ఈ విమాన వాహక నౌకను రూపొందించడంతో అమెరికాకు చైనా భారీ సవాలునే విసురుతోంది. 2020 నాటికల్లా ఈ నౌకా నిర్మాణం పూర్తి చేయాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి.ఎల్.ఎ) తలపెట్టినట్లు…

బ్రిక్స్ పీఠంపై బాహాబాహి, జపాన్ వాకిట భిక్షాందేహి

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) సమావేశంలో సహచర ఎమర్జింగ్ దేశాలతో కలిసి “పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిద్దాం, బహుళ ధృవ ప్రపంచాన్ని స్ధాపిద్దాం” అని పిలుపు ఇచ్చే భారత పాలకులు ధనిక దేశాల వద్ద దేహి అనడం మాత్రం మానడం లేదు. అలవాటు పడిన ప్రాణం ఏమో గాని, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకునే భారత ప్రభుత్వం రైల్వే సబ్ వేల నిర్మాణం పేరిట 2.32 బిలియన్ డాలర్ల…

దక్షిణ చైనా సముద్రానికి అవసరమైతే బలగాలు పంపుతాం -ఇండియా

దక్షిణచైనా సముద్ర గొడవల్లో తానూ ఉన్నానని భారత ప్రభుత్వం మరోసారి చాటింది. భారత ప్రభుత్వ కంపెనీ ‘ఒ.ఎన్.జి.సి విదేశ్’ దక్షిణచైనా సముద్రంలో ఆయిల్ పరిశోధనలో పాల్గొంటున్నందున భారత వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైతే ఇండియా కూడా తన బలగాలను పంపిస్తుందని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి స్పష్టం చేశాడు. సరిహద్దు తగాదాపై చర్చించడానికి భారత జాతీయ భద్రతాధికారి శివశంకర్ మీనన్ చైనా పర్యటనలో ఉండగానే నేవీ చీఫ్ ప్రకటన ఒకింత ఆసక్తిని రేపింది. ప్రపంచ సముద్ర…