అమెరికా, జపాన్ లతో మిలట్రీ డ్రిల్ కు ద.కొరియా నో!

ఆసియాలో, ఖచ్చితంగా చెప్పాలంటే దక్షిణ చైనా సముద్ర తీరంలో ఒక విశేషం చోటు చేసుకుంది. ఆసియాలో జపాన్ తర్వాత దక్షిణ కొరియాయే అమెరికాకు నమ్మిన బంటు. అమెరికాకు చెందిన అది పెద్ద సైనిక స్ధావరాలు జపాన్, దక్షిణ కొరియాలలోనే ఉన్నాయి. అయితే ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని బెదిరించడానికి జపాన్, అమెరికాలు తలపెట్టిన సంయుక్త విన్యాసాలలో పాల్గొనడానికి దక్షిణ కొరియా నిరాకరించడమే ఆ విశేషం. ఉత్తర కొరియాకు చెందిన జలాంతర్గాములను లక్ష్యం చేసుకుని దక్షిణ కొరియాతో…

చలి నీళ్ళకు పిల్లలు తట్టుకోలేరనుకున్నా -ద.కొరియా నౌక కెప్టెన్

నౌక ఖాళీ చేయమని ఆదేశాలిస్తే పిల్లలు అంత చలిలో చల్లటి నీళ్ళకు తట్టుకోలేక చనిపోతారని భావించానని దక్షిణ కొరియాలో ప్రమాదానికి గురయిన ‘సెవొల్’ కెప్టెన్ కోర్టుకు తెలిపాడు. అందుకే వారిని వెంటనే పడవ ఖాళీ చేయాలని ఆదేశాలివ్వడానికి తటపటాయించానని కెప్టెన్ లీ జూన్-సియోక్ చెప్పారు. పడవ ఖాళీ చేయాలని కోరడంలో 40 ని.లు ఆలస్యం కావడంతో ఎక్కువమంది తప్పించుకోలేక నౌకలోనే చిక్కుకుపోయారు. 32 మంది మరణాలను దక్షిణ కొరియా ప్రభుత్వం ధృవీకరించగా ఇంకా 273 మంది జాడ…

300 మంది పిల్లల్ని మింగిన ద.కొరియా టైటానిక్ -ఫోటోలు

దక్షిణ కొరియాలో మహా విషాధం సంభవించింది. వందలాది మంది పాఠశాల పిల్లల్ని ఒక ద్వీపానికి విహార యాత్రకు తీసుకెళ్తున్న ఒక నౌక ప్రమాదానికి గురయింది. హఠాత్తుగా పక్కకు ఒరగడం మొదలు పెట్టిన నౌక క్రమంగా సాయంత్రానికి నీళ్ళల్లో దాదాపు పూర్తిగా మునిగిపోయింది. టైటానిక్ పడవ మధ్యలో విరిగిపోయినట్లు ఈ పడవ విరగలేదు గానీ బైటి జనం, ఫోటోగ్రాఫర్లు చూస్తుండగానే కాస్త కాస్త మునిగిపోతూ పెను విపత్కర దృశ్యాన్ని ప్రపంచం ముందు ఉంచింది. నౌక మునిగిపోతున్నప్పటికీ దానిని వెంటనే ఖాళీ…

దక్షిణ కొరియా పేడోఫైల్ కు కెమికల్ కేస్ట్రేషన్ శిక్ష

లైంగిక అత్యాచారాల నిరోధం విషయంలో భారత ప్రభుత్వానికి దక్షిణ కొరియా ఒక దారి చూపినట్లు కనిపిస్తోంది. అత్యాచార నేరస్ధులకు ‘రసాయన పుంస్త్వనాశనం’ (chemical castration) ఒక శిక్షగా విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ప్రతిపాదించగా దక్షిణ కొరియా కోర్టు ఒక పెడోఫైల్ (చిన్నపిల్లలపై అలవాటుగా లైంగిక అత్యాచారం చేసే వ్యక్తి) కి మొదటిసారిగా ‘రసాయన పుంస్త్వ నాశనం’ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కెమికల్ కేస్ట్రేషన్ కు అనుగుణంగా 2011లో చట్టం చేసిన తర్వాత దక్షిణ కొరియాలో…

ప్రయాణీకుల జెట్ విమానంపై పొరపాటున కాల్పులు జరిపిన దక్షిణ కొరియా సైన్యం

దేశాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియ జెప్పే సంఘటన ఇది. 119 మంది ప్రయాణికులు ఉన్న జెట్ విమానం ఉత్తర కొరియా ప్రయోగించిన యుద్ధ విమానంగా భావించి దక్షిణ కొరియా సైన్యం దానిపైకి కాల్పులు జరిపించి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఆ రెండూ 1950ల్లో విడిపోయినప్పటినుండీ ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా దక్షిణ కొరియాలో సైనిక స్దావరాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఇరు పక్షాల…