ప్రమాణానికి ముందే ఆఫ్ఘన్ తో చర్చలు చేసిన మోడి

మాట్లాడితే ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లపై విద్వేషం వెళ్లగక్కే మోడి అభిమానులు, ప్రధానిగా మోడి తీసుకుంటున్న చర్యలను ఏ విధంగా అర్ధం చేసుకుంటారన్నదీ పరిశీలించాల్సిన విషయం. భారత దేశానికి శత్రు దేశాలయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లతో సత్సంబంధాలను మీరు ఎలా కోరుకుంటారో అర్ధం కావట్లేదు అని ఒక హిందూత్వ అభిమాని ఈ బ్లాగ్ రచయితను ప్రశ్నించిన సంగతి ఇటీవలి విషయమే. అయితే మోడి ప్రధాన మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయకమునుపే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్ధాన్ రెండు దేశాలతోనూ చర్చలు…

భారత్ పై అతి కేంద్రీకరణే లాడెన్ హత్యకు అవకాశం -పాక్ రిపోర్ట్

భారత దేశంతో ఉన్న సరిహద్దులపై అతిగా దృష్టి కేంద్రీకరించడం వల్లనే అమెరికా నేవీ సీల్ బృందం, పాకిస్ధాన్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్ ఇంటిపై దాడి చేయగలిగిందని పాకిస్ధాన్ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా మిలట్రీ సంపాదించుకున్న స్టెల్త్ టెక్నాలజీ (సాధారణ పరిజ్ఞానానికి దొరకని విధంగా విమానాలు ఎగరగల సామర్ధ్యం) కూడా లాడెన్ ఇంటిపై దాడిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడిందని సదరు నివేదిక తెలిపింది. మే 2, 2011 తేదీన…

పాక్‌లో మళ్ళీ అధికార కుస్తీలు, సూఫీ గురువు వెనుక దాగిన మిలట్రీ?

సూఫీ గురువు తాహిర్-ఉల్-ఖాద్రి కెనడా నుండి పాకిస్థాన్ లోకి తిరిగి ప్రవేశించినప్పటినుండీ అక్కడ అధికార కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలనీ, మే నెలలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలనీ ఖాద్రి ఒకవైపు డిమాండ్ చేస్తుండగా, మరో వైపు పాకిస్థాన్ ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయనను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చిందని ఫస్ట్ పోస్ట్ తెలిపింది .…

క్లుప్తంగా… 06.05.2012

జాతీయం భోపాల్ బాధితులకు మూడు నెలల్లో శుభ్రమైన నీళ్లివ్వండి -సుప్రీం కోర్టు భోపాల్ దుర్ఘటన జరిగి దాదాపు ముప్ఫై యేళ్ళు అవుతున్నా బాధితులు ఇప్పటికీ కాలుష్య పూరితమైన, క్యాన్సర్ కారక నీటినే తాగవలసి రావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో వారికి పరిశుభ్రమైన నీరు తాగే సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు లేకపోవడం కారణాలుగా చెప్పడానికి వీల్లేదనీ, ఆగస్టు 13 కల్లా నీటి సౌకర్యం కల్పించిన నివేదిక తనకి…

ప్రధాని జిలాని గౌరవనీయుడు కాడు, తేల్చేసిన పాక్ సుప్రీం

ఇండియా, పాక్ లలో రాజకీయ నాయకులను కోర్టులు చెడుగుడు ఆడేస్తున్నాయి. ఎ.రాజా, గాలి జనార్ధన్ తదితరులను అవినీతి ఆరోపణలపై జైలుకి పంపిన భారత కోర్టులు ఇంకా జగన్, దయానిధి తదితరులకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి విదితమే. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై సుప్రీం కోర్టుకి ఇచ్చిన హామీలను గౌరవించకుండా పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ‘గౌరవనీయుడు కాద’ ని అక్కడి సుప్రీం కోర్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. ప్రధాని జిలానికి…

పాక్‌కి అమెరికా సాయం నిలిపివేయడాన్ని ఆహ్వానించిన ఇండియా

పాకిస్ధాన్‌కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయడం పట్ల భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను ఆహ్వానిస్తున్నట్లు ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రకటించాడు. అమెరికా అందజేసే ఆయుధాలవలన ఈ ప్రాంతంలో ఆయుధాల సమతూకాన్ని దెబ్బతీసి ఉండేదని ఆయన అన్నాడు. “ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా, ఈ ప్రాంతాన్ని అమెరికా భారీగా ఆయుధమయం చేయడం వాంఛనీయం కాదని ఇండియా మొదటినుండి చెబుతున్న నేపధ్యంలో, ఆయుధీకరణ…

ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…