తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభ్యంతరాలను తోసి పుచ్చుతూ కతార్ రాజధాని ‘దోహా’ లో కార్యాలయం తెరవడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ కి అనుమతి దొరికింది. ఈ మేరకు కతార్, ఆఫ్ఘన్ తాలిబాన్ ల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లతో తాలిబాన్ జరపబోయే శాంతి చర్చలకు ఈ కార్యాలయం అనుమతి దోహదపడుతుందని అమెరికా ఆశపడుతోంది. కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి నిజానికి అంగీకారం ఎన్నడో కుదిరింది. కాని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్…