స్వతంత్రం రెచ్చగొడితే తీవ్ర చర్యలు తప్పవు! -తైవాన్ తో చైనా
చైనా మరోసారి తైవాన్ ను తీవ్రంగా హెచ్చరించింది. ‘స్వతంత్రం’ పేరుతో జనాన్ని రెచ్చగొడుతూ ఉంటే తీవ్ర చర్యలు తప్పవు, అని చైనా ప్రభుత్వం తైవాన్ ను హెచ్చరించింది. “స్వతంత్రం ప్రకటించుకునే వైపుగా ఏ మాత్రం అడుగు వేసినా చర్యలు తప్పవు” అని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ప్రతినిధి మా చియావో గువాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించాడు. తైవాన్ తో శాంతియుతంగా ఐక్యం కావడానికి కృషి చేసేందుకు చైనా దేశం సిద్ధంగా ఉందనీ అయితే స్వతంత్రత ప్రకటించుకునే…