తెలంగాణ చర్చ: కొన్ని ఆసక్తికర ఘటనలు

‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ పై చర్చ సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలకు లోక్ సభ కేంద్రం అయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టకేలకు సాకారం అయ్యేలా చొరవ చూపినందుకు లేదా సహకరించినందుకు సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసేది ఒకరయితే తనకూ కొంత క్రెడిట్ ఇవ్వాలని కోరేది మరొకరు. లగడపాటి పెప్పర్ స్ప్రే పుణ్యమాని ఎం.పిలే తమ తమ నాయకులకు కాపలా కాసిన పరిస్ధితి. ఒక పక్క నినాదాల హోరు సాగుతుండగానే మరో పక్క క్లాజుల…

తెలంగాణ బిల్లు ఆమోదించారు

ఒక ముఖ్యమైన అంకం పూర్తయింది. ఎంత ముఖ్యం అనుకున్నారో అంత వివాదాస్పదంగా ముగిసిపోయింది. ఒక ప్రాంత ప్రజల ప్రజాస్వామిక కోర్కెను మన్నించడానికి మరో ప్రాంత ధనిక వర్గాలు ససేమిరా అంగీకరించకపోవడంతో చివరికి మూజువాణి ఓటే తెలంగాణకు శరణం అయింది. ‘సీమాంధ్రకు కూడా న్యాయం’ నినాదం మాటున తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తినే మూల్యంగా చెల్లించుకోవాల్సిన డిమాండ్లు సీమాంధ్ర నాయకులు ముందుకు తేవడంతో సామరస్య వాతావరణానికి చోటు లేకుండా పోయింది. వెరసి గందరగోళం మధ్యనే లోక్ సభ ‘ఆంధ్ర ప్రదేశ్…

బి.జె.పికి ఆటవస్తువు తెలంగాణ -కార్టూన్

తెలంగాణ బిల్లు పైన కేబినెట్ కసరత్తు పూర్తయ్యి బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశిస్తున్న తరుణంలో బి.జె.పి ఇక తన అసలు రూపం చూపడం ప్రారంభించింది. రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నట్లు ఆరోపిస్తూ వచ్చిన బి.జె.పి తాను స్వయంగా వివిధ గొంతులతో మాట్లాడడం ప్రారంభించింది. ఒకవైపు బేషరతు మద్దతు అని చెబుతూనే సీమాంధ్రకు న్యాయం చేయాలని కొత్తగా అనుపల్లవి అందుకుంది. బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ ‘బిల్లుకు మద్దతు ఇచ్చి తీరతాం’ అని ప్రకటిస్తుండగానే…

పార్లమెంటు గొంగట్లో అప్రజాస్వామిక వెంట్రుకలు ఏరగలమా?

(పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! ఆర్టికల్ కింద మిత్రుల వ్యాఖ్యలకు రాసిన సమాధానంలో కొన్ని మార్పులు చేసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్) ********* పార్లమెంటులో సభ్యులు ప్రజాస్వామికంగా వ్యవహరించడం అంటే ఏమిటి? ఎవరి సీట్లలో వారు కూర్చొని ఆయా బిల్లులపై తమ పార్టీల వైఖరికి కట్టుబడి అభిప్రాయాలు చెప్పడం. ఓటింగ్ జరిగినప్పుడు ఓటు వేయడం. సభాపతి అవకాశం ఇచ్చినపుడు మాట్లాడడం. సభా కార్యకలాపాలు దాదాపు అన్నీ ముందే నిర్ణయం అవుతాయి. ఎవరు ఎప్పుడు మాట్లాడాలీ, ఏ అంశం…

లగడపాటిపై దాడి జరగలేదు -ఐ.బి.ఎన్ విలేఖరి (వీడియో)

ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే జల్లానని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ చెప్పడం అబద్ధం అని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ విలేఖరి ఈ వీడియోలో చెబుతున్నారు. తాను ప్రెస్ గ్యాలరీలో ఉన్నానని సభలో మాత్రం లగడపాటిపై ఎవరూ దాడి చేయలేదని విలేఖరి చెప్పారు. మొత్తం వ్యవహారం 5 నిమిషాల్లో ముగిసిపోయిందని, ఈ సమయంలో లగడపాటి తనంతట తానే పెప్పర్ స్ప్రే జల్లారు గాని, ఆత్మరక్షణ చేసుకుని పరిస్ధితులు ఆయన ఎదుర్కోలేదని ఈమె చెబుతున్నారు. (వీడియో అందజేసినవారు: టి.జి.టాకీస్)

పార్లమెంటులో ఆంధ్ర ప్రదేశ్ -కార్టూన్

మేధావి: ఫిషనా లేక ఫ్యూషనా? సామాన్యుడు: ఏదీ కాదు పెప్పర్ స్ప్రే *** భారత దేశానికి పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం.  సభలో కూర్చునేవారు ఈ సంగతి చెబుతారు. సభ బయట ఉన్న మనం అది నిజమే కాబోలని నమ్ముతున్నాం. ప్రజాస్వామ్య దేవాలయం ప్రాశస్త్యం గురించి అనేక పుస్తకాలు, పాఠ్య గ్రంధాలు, పరిశోధనా పత్రాలు చెప్పే సూత్రాలకు ఇక కొదవే లేదు. కానీ వాస్తవంగా జరుగుతోంది మాత్రం ఇందుకు విరుద్ధం. పార్లమెంటులో సజావుగా చర్చలు జరిగిన సందర్భాలు చాలా…

పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! -వీడియో

‘ఆత్మ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే చల్లాను’ అని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ తన చర్యను సమర్ధించుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్యానికి తీరని కళంకం అనీ, దుర్దినం అనీ, మాయని మచ్చ అనీ, సభ్యుడిని ఎన్నికల నుండి డీబార్ చేయాలని, దేశానికి చెడ్డపేరు తెచ్చారని దాదాపు అందరూ విమర్శిస్తున్నప్పటికీ లగడపాటి పాత్రం తన చర్యను సమర్ధించుకుంటున్నారు. టి.డి.పి ఎం.పి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కాపాడడానికి పరుగెత్తానని, తమపై గూండాల్లాంటి ఎం.పిలు దాడికి వచ్చారనీ, అందుకే ఆత్మ రక్షణ…

నూతన దిగజారుడుతో వేగడం ఎలా -ది హిందు సంపాదకీయం

(లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో పెప్పర్ స్ప్రే జల్లి తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై ఈ రోజు -ఫిబ్రవరి 14- ది హిందూ పత్రిక రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) సుదీర్ఘమైన, నిష్ప్రయోజనకరమైన పార్లమెంటరీ గలాటా చరిత్ర కలిగిన దేశానికి కూడా సభ ముందుకు సాగకుండా అడ్డుకోవడం కోసం ఒక సభ్యుడు తన తోటి సభ్యుల పైన పెప్పర్ స్ప్రే జల్లడానికి తెగించడం కంటే మించిన సిగ్గుమాలినతనం, గౌరవ హీనం మరొకటి ఉండబోదు. సభలో…

చాయ్, మోడిలతో బి.జె.పి రెడీ -కార్టూన్

– పదేళ్ళ నుండి తెలంగాణ బిల్లును నానబెట్టిన కాంగ్రెస్ పార్టీ, 2014 ఎన్నికల కోసం మాత్రమే అలా చేసిందని, బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోవడంతో టి.బిల్లుపై హడావుడి పడుతోందని ఈ కార్టూన్ సూచిస్తోంది. ***                    ***                    *** బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పుడేం ఖర్మ! ఎప్పుడో మొదలైపోయింది. ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలను కూడా ప్రచార సామాగ్రిగా మార్చుకుని మరీ అది ఎన్నడో రంగంలోకి దిగింది. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా వెనకబడి ఏమీ లేదు. రాహుల్…

6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు

ప్రతిపక్ష బి.జె.పి విమర్శలు తమ ద్వంద్వ ఎత్తుగడలను ఉతికి ఆరబెట్టడంతో కాంగ్రెస్ సవరణలకు దిగింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎం.పిలను పార్టీ నుండి బహిష్కరించింది. తద్వారా తెలంగాణ బిల్లు విషయంలో తాను సీరియస్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. బిల్లును మొదట రాజ్యసభలో పెడతామని చెప్పిన ప్రభుత్వం న్యాయశాఖ సలహాతో రూటు మార్చుకుని లోక్ సభలో పెట్టడానికి నిర్ణయించుకుంది. 6గురు కాంగ్రెస్ ఎం.పి లు అమరవీరులుగా ఛానెళ్ల ముందు నిలబడుతుండగా,…

కోస్తాంధ్ర, హైద్రాబాద్ లది మిగులు బడ్జెట్

  బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ను హైద్రాబాద్, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ.. అన్న నాలుగు యూనిట్ లుగా విడదీస్తే అందులో హైద్రాబాద్, కోస్తాంధ్రలు మిగులు బడ్జెట్ తో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు మాత్రం లోటు బడ్జెట్ తో ఉన్నాయని తెలిపారు. కోస్తాంధ్ర (7 జిల్లాలు) ప్రాంతం 684 కోట్ల మిగులు బడ్జెట్ కలిగి ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. హైద్రాబాద్ ఏకంగా 12,854 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్…

తెలంగాణ: లైన్ క్లియర్, రాజీనామా యోచనలో కిరణ్

రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా పార్లమెంటులో ప్రవేశించనున్న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎం.పిలు, ఎమ్మేల్యేలు తదితరులు ప్రతిపాదించిన సవరణలలో కొన్నింటిని బిల్లులో చేర్చడానికి కేబినెట్ ఆమోదించింది. అయితే సీమాంధ్ర నాయకుల డిమాండ్లను ఏ మేరకు అంగీకరించారు అన్న అంశంలో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లు వివరాలను ముందే పత్రికలకు చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన కావడంతో హోమ్ మంత్రి బిల్లు, సవరణల వివరాలను పత్రికలకు చెప్పలేదు.…

ఎ.పి అసెంబ్లీ ఆటంకం దాటిన టి.బిల్లు -కార్టూన్

ఎన్.డి.ఎ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జార్ఖండ్, ఛత్తీస్ ఘర్, ఉత్తర ఖండ్. ఈ రాష్ట్రాల ఏర్పాటు నల్లేరుపై నడకలాగే సాగింది. ఆ ప్రాంతాల మూల రాష్ట్రాల అసెంబ్లీలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం దానికొక కారణం. అక్కడ అభ్యంతరం చెప్పకపోవడానికీ, ఇక్కడ తీవ్ర అభ్యంతరం చెప్పడమే కాకుండా ఆందోళనలు కూడా జరగడానికి కారణం ఏమిటి? బి.జె.పి పార్టీ దానికి కారణం కాంగ్రెస్ వ్యవహరించిన పద్ధతి అని ఆరోపిస్తోంది. ‘మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది’ అని వెక్కిరిస్తోంది. ‘ప్రశాంతంగా పాత…

తెలంగాణ బిల్లును తిరస్కరించిన అసెంబ్లీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ను తిరస్కరించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. తీర్మానం ప్రవేశపెడతామని స్పీకర్ గత బి.ఎ.సి సమావేశంలోనే చెప్పడంతో తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయం అయింది. అయితే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు సభా కార్యక్రమాలకు అడ్డు పడడంతో తీర్మానం ఎలా ప్రవేశపెడతారన్న ప్రశ్న ఉదయించింది. ఈ సమస్యను అధిగమించడానికి…

బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ఆయన సహకరిస్తారని కొందరు చేసిన ఊహాగానాలు సరికాదని గత కొద్ది రోజులుగా కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా అర్ధం అవుతోంది. ఎ.ఐ.సి.సి సమావేశాలకు, రాజ్యసభ నామినేషన్ల ఎంపికకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలిచినా వెళ్లని…